జాతర ఇక్కడ ముగిశాక.. అక్కడ మొదలైతది 

జాతర ఇక్కడ ముగిశాక.. అక్కడ మొదలైతది 

కొత్తగూడ, వెలుగు : మేడారం సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతరను ఈనెల 23 నుంచి 25వరకు నిర్వహిస్తున్నట్లు ప్రధాన పూజారులు పెనుక బుచ్చిరాములు, సురేందర్, రాజేశ్వర్ ​తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ ఈనెల 15న మేడారానికి పగిడిద్దరాజును తరలిస్తామన్నారు. అక్కడ మహాజాతర ముగిశాక తిరుగు వారం మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు జాతరను ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 23 బుధవారం ఉప వాసం ఉండి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. సాయంత్రం దేవునిగుట్ట నుంచి పగిడిద్దరాజును గుడికి చేరుస్తామన్నారు. 24న పగిడిద్దరాజు, సమ్మక్కలను గ్రామంలో ఊరేగించి గంగ స్నానం చేయిస్తామన్నారు. 25న ఉదయం నుంచి సాయం త్రం వరకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నాక సాయంత్రం వన ప్రవేశం ఉంటుందన్నారు.