
శ్రీనగర్/న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైనవారిని పట్టుకునేందుకు భద్రతాదళాలు జమ్మూకాశ్మీర్‌లో భారీగా మోహరించాయి. దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు అక్కడి సమీప అటవీ ప్రాంతాల్లోనే దాక్కొని ఉంటారని సెక్యూరిటీ ఫోర్స్ భావిస్తున్నాయి. అన్ని ఏరియాలను క్షుణ్ణంగా చెక్ చేస్తున్నాయి.
కుల్గాం, పూంచ్, కతువా వంటి ఏరియాల్లోనూ భారీగా తనిఖీలు కొనసాగుతున్నాయి. కుల్గాంలో సెక్యూరిటీ ఫోర్స్‌కు, ఉగ్రవాదులకు మధ్య ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ఇందులో పహల్గాం ఉగ్రదాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) కమాండర్ చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల సమాచారం అందిస్తే రూ.20 లక్షల రివార్డు ఇస్తామని జమ్మూకాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. కాగా, జమ్మూకాశ్మీర్ పరిసరాల్లో దాదాపు 56 మంది విదేశీ టెర్రరిస్టులు ఉన్నట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి.