అపర్ణ బొమ్మేస్తే ఔరా అనాల్సిందే..!

అపర్ణ బొమ్మేస్తే ఔరా అనాల్సిందే..!

హైదరాబాద్, వెలుగు: ఆమె కుంచె నుంచి జాలువారిన చిత్రాలు మదిని దోస్తాయి. అద్భుత కళాఖండాలు ఔరా అనిపిస్తాయి. దశాబ్దాలుగా చిత్ర కళా రంగంలో రాణిస్తున్న ఆమె పేరు అపర్ణ. తార్నాకలో నివాసముండే అపర్ణ ఇప్పటి వరకు ఎన్నో అద్భుత కళాఖండాలను తన కుంచె ద్వారా తీర్చిదిద్దారు. ప్రధానంగా మహిళలు, పుష్పాలను ప్రేరణగా తీసుకుని చిత్రాలు గీస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి … సన్మా నాలు, సత్కారాలు పొందారు. మున్ముందు మరిన్ని అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దడమే తన ధ్యేయమంటున్నారు. తన కుంచె ద్వారా అద్భుత కళాఖండాలు జాలువారుస్తు న్న ఈ కళాకారిణి అపర్ణ. చిన్నప్పటి నుంచి చిత్రాలు వేయడం అంటే ఎంతో ఇష్టం. తను గీసిన చిత్రాలతో 2005 నుంచి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్న ఈమె ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. మగువలు, పుష్పాలు ప్రధాన అంశంగా ఆమె ఎన్నో చిత్రాలు గీశారు. మగువలు ఎందులోనూ తక్కువ కాదని చాటిచెబుతూ గీసిన మహిళ చిత్రం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు సుమారు 200 ప్రదర్శనలిచ్చిన అపర్ణ 20 వరకు పురస్కారాలను అందుకున్నారు.

భరతముని కళారత్నం పురస్కా రం, యువ కళావాహిని వారి.. గురు ప్రసాద్ ఎక్సలెన్సీ అవార్డు, జాతీయ స్థాయిలో ఇచ్చిన ప్రదర్శనలకు పలు జ్యూరీ అవార్డులను అందుకున్నా రు. జాతీయ స్థాయిలో ఇచ్చిన ప్రదర్శనలకు పలు నగదు పురస్కారాలు సైతం స్వీకరిం చారు. బ్లేడ్ తో వేసే బ్లేడ్ పెయింటింగ్ , పోర్సిలిన్ పెయింటింగ్ లకు ప్రపంచ రికార్డులు అందుకున్నారు. పోర్సిలిన్ అనేది ప్రపంచంలోనే అరుదైన చిత్రకళ. చాలా ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చిత్రం గీయాలనుకున్న దాన్ని 850 డిగ్రీల వరకు వేడి చేయాల్సి ఉంటుంది . కలర్స్, బ్రష్ లు, టూల్స్ చాలా ఖరీదైనవని వాడాల్సి ఉంటుంది. పింగాణి పాత్రలపై వేసే చిత్రాలు శాశ్వతంగా ఉండిపోతాయి. ఎన్నో గోడ గడియారాలు, డిన్నర్ సెట్స్, డెకరేటివ్ ప్లేట్స్ పై చిత్రాలు, అందమైన పుష్పాలను గీశారు. బ్లేడ్ పెయింటింగ్ కూడా ఎంతో అనుభవం, ఓపికతో చేయాల్సిన కళ. వీటికోసం క్రిలిక్ పెయిటింగ్ స్ ను వేశారు. అవి ఎంతో వైవిధ్య భరితంగా, అందంగా కనిపించేలా అద్భు త కళా ఖండాలు తీర్చిదిద్దా రు. మున్ముం దు మరిన్ని అందమైన చిత్రాలు గీయడమే తన జీవిత లక్ష్యమంటున్న అపర్ణ … నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.