Asia Cup 2023: భారత్‌ను ఢీకొట్టబోయే పాకిస్తాన్ జట్టు ఇదే 

Asia Cup 2023: భారత్‌ను ఢీకొట్టబోయే పాకిస్తాన్ జట్టు ఇదే 

భారత్‌ను ఢీకొట్టేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బలమైన జట్టునే బరిలోకి దించింది. ఆసియన్ దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023 కోసం పాక్ 18 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. షాదాబ్‌ ఖాన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరరించనున్నాడు. 

అలాగే ఆసియా కప్ టోర్నీకిముందు పాక్.. అఫ్ఘనిస్తాన్ జట్టుతో  3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ  సిరీస్‌కు కూడా ఇదే జట్టుతో బరిలోకి దిగనుంది. ఈ జట్టులో కొత్తగా సౌద్‌ షకీల్‌, ఫాహీమ్‌ అఫ్రాఫ్‌, తయ్యబ్‌ తాహిర్‌లు చోటు దక్కించుకోగా.. పేలవ ఫామ్‌ కారణంగా షాన్‌ మసూద్‌పై వేటు పడింది.  

ఆసియా కప్‌, ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌కు పాక్‌ జట్టు

బాబర్ ఆజమ్‌ (కెప్టెన్), ఫఖర్ జమాన్, మహమ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమామ్ ఉల్ హక్, మహమ్మద్ హారీస్, మహమ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్, నసీమ్ షా, ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, తయ్యబ్ తాహిర్, ఉసామా మీర్.

పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్‌ వన్డే సిరీస్‌ షెడ్యూల్

  • తొలి వన్డే (హంబన్‌తోట): ఆగస్ట్‌ 22
  • రెండో వన్డే (హంబన్‌తోట): ఆగస్ట్‌ 24
  • మూడో వన్డే (కొలొంబో): ఆగస్ట్‌ 26

ఆసియా కప్ 2023 షెడ్యూల్

  • ఆగస్టు 30: పాకిస్థాన్ vs నేపాల్ (ముల్తాన్)
  • ఆగస్టు 31: బంగ్లాదేశ్ vs శ్రీలంక (క్యాండీ)
  • సెప్టెంబర్ 2: ఇండియా vs పాకిస్తాన్ (క్యాండీ)
  • సెప్టెంబర్ 3: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)
  • సెప్టెంబర్ 4: ఇండియా vs నేపాల్ (క్యాండీ)
  • సెప్టెంబర్ 5: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)

సూపర్ 4:

  • సెప్టెంబర్ 6: A1 vs B2 (లాహోర్)
  • సెప్టెంబర్ 9: B1 vs B2 (కొలంబో)
  • సెప్టెంబర్ 10: A1 vs A2 (కొలంబో)
  • సెప్టెంబర్ 12: A2 vs B1 (కొలంబో)
  • సెప్టెంబర్ 14: A1 vs B1 (కొలంబో)
  • సెప్టెంబర్ 15: A2 vs B2 (కొలంబో)
  • సెప్టెంబర్ 17: ఫైనల్ (కొలంబో)

ఆసియా కప్ మ్యాచ్‌లు అన్ని భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నాం మూడు గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి.