పాకిస్తాన్లో పరువు హత్య..పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని..జంటను దారుణంగా కాల్చి చంపారు

పాకిస్తాన్లో పరువు హత్య..పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని..జంటను దారుణంగా కాల్చి చంపారు

పాకిస్తాన్లో పరువు హత్య.. నైరుతి బలూచిస్తాన్  ప్రావిన్స్ లో పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని కొత్త జంటను దారుణంగా కాల్చి చంపారు ఓ తెగకు చెందిన గుంపు. సోమవారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సీరియస్ గా తీసుకున్న అక్కడి ప్రభుత్వం 12మంది నిందితులను అరెస్ట్ చేసింది.వివరాల్లోకి వెళితే..  

అది ఎడారి పర్వత ప్రాంతం.. డజనుకు పైగా మంది పురుషులు.. వాహనాల్లో అక్కడికి జంటను తీసుకెళ్లారు.. మహిళను ఎదురుగా నిలబడమని ఆదేశించారు. ఓ వ్యక్తి ఆమె వెనకనుంచి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత అదే తుపాకీలో మరో యువకుడిని కాల్చిచంపాడు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

స్థానిక వార్తా సంస్థల ప్రకారం.. నైరుతి బలూచిస్తాన్ లోని ఓ తెగకు చెందిన ఈ జంట ఆ తెగ పెద్దలకు ఇష్టం లేకుండా, తెగ సాంప్రదాయానికి విరుద్దంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఆగ్రహించిన తెగ పెద్దలుఆ జంటకు కాల్చి చంపాలనే శిక్ష వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొదట ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మంగళవారం  మరో 11మందిని అరెస్ట్ చేశారు. వీరిలో తెగ నాయకుడు కూడా ఉన్నారు. ఈ కేసులో డీఎస్పీని సస్పెండ్ చేశారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు బాధితుల బంధువులు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

పరువుహత్య పాకిస్తాన్ ఓ సామాజిక సమస్య 

పాకిస్తాన్‌లో పరువు హత్యలు (Honor Killings) సర్వసాధారణం. ఇక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు కొన్నిసార్లు స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని పాటించని లేదా తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే మహిళలను, పురుషులను చంపుతుంటారు. తాజా ఘటన ఈ సామాజిక సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

►ALSO READ | ఒక్కసారే గుండె ఆగినంత పని అయింది: లైవ్ రిపోర్టింగ్ చేస్తూ డెడ్ బాడీపై కాలుపెట్టిన జర్నలిస్ట్