ఒక్కసారే గుండె ఆగినంత పని అయింది: లైవ్ రిపోర్టింగ్ చేస్తూ డెడ్ బాడీపై కాలుపెట్టిన జర్నలిస్ట్

ఒక్కసారే గుండె ఆగినంత పని అయింది: లైవ్ రిపోర్టింగ్ చేస్తూ డెడ్ బాడీపై కాలుపెట్టిన జర్నలిస్ట్

బ్రెజిల్‎లో ఓ ఆసక్తికర, భయంకర ఘటన చోటు చేసుకుంది. విధుల్లో భాగంగా ఓ జర్నలిస్ట్ నదిలో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా అనుకోకుండా మృతదేహంపై కాలు వేశాడు. నదిలో ఏదో తగులుతున్నట్లు అనిపించడంతో భయంతో ఒక్కసారిగా బయటకు దూకాడు. ఈ తతంగం మొత్తం లైవ్‎లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. 

వివరాల ప్రకారం.. ఈశాన్య బ్రెజిల్‌లోని బకాబల్‌లోని మెరిమ్ నదిలో ఓ 13 ఏళ్ల బాలిక తప్పిపోయింది. నదిలో బాలిక మిస్సింగ్ వ్యవహారం స్థానికంగా దుమారం రేపడంతో ఈ ఘటనపై రిపోర్టింగ్ చేసేందుకు లెనిల్డో ఫ్రజావో అనే జర్నలిస్ట్ ఘటన స్థలానికి వెళ్లాడు. నదిలో బాలిక చివరిసారిగా కనిపించిన చోటుకు వెళ్లి అక్కడ నీటి లోతు గురించి వివరిస్తూ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు. నదిలో తన ఛాతీ మునిగే లోతు వరకు వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో లెనిల్డో ఫ్రజావోకు నదిలో ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే భయంతో నది నుంచి బయటకు వచ్చాడు.

Also Read : విడాకుల కేసుపై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు

 నదిలో ఏమో అనుమానస్పదంగా తగిలిందని.. బహుశా మిస్ అయిన బాలిక డెడ్ బాడీనే కావొచ్చని లెనిల్డో ఫ్రజావో అనుమానం వ్యక్తం చేశాడు. తనకు తగిలింది బాలిక చేయి కావొచ్చని అధికారులకు చెప్పాడు. వెంటనే లెనిల్డో ఫ్రజావో చెప్పిన స్థలంలో రెస్య్కూ టీమ్స్ గాలించాయి. నిజంగానే అదే ప్రదేశంలో బాలిక డెడ్ బాడీని గుర్తించారు రెస్య్కూ టీమ్స్. ఈ ఘటనతో జర్నలిస్ట్ ఫ్రజావోకు గుండె ఆగినంత పని అయింది. ఫ్రజావో నదిలోకి దిగడం, బాలిక డెడ్ బాడీ తగలడం, భయంతో బయటకు పరుగులు తీసిన వ్యవహారమంతా లైవ్‎లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.