విడాకుల కేసుపై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు: నెలకు రూ.కోటిపై అవాక్కు..చివరికి తీర్పు ఎలా వచ్చిందంటే..!

విడాకుల కేసుపై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు: నెలకు రూ.కోటిపై అవాక్కు..చివరికి తీర్పు ఎలా వచ్చిందంటే..!

సమాజం ఎలా ఉందో కళ్లకు కనిపిస్తూనే ఉంది..భర్తను చంపే భార్యలు..భార్యలను చంపే భర్తలు..వీటితోపాటు విడాకుల కేసులు. 2025, జూలై 22న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్పై విడాకుల కేసు విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సందర్భంగా..చీఫ్ జస్టిస్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..కొన్ని ప్రశ్నలను కూడా సంధించారు. మహిళ కోరుకున్న డిమాండ్లు విని కొంచెం అవాక్కయ్యిన జడ్జిగారు..బాధిత భార్యపై..అదే విధంగా విడాకులు కోరుతున్న భర్తపైనా సంధించిన ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్: జీవనభృతి కోసం మీ డిమాండ్ ఏమిటి?
మహిళ: ముంబైలో ఒక ఇల్లు కావాలి. అంతేకాకుండా నా మెయింటెనెన్స్ కోసం.. రూ.12 కోట్లు ఇవ్వాలి.
CJI గవాయ్: (ఆశ్చర్యంగా) ఆ ఇల్లు కల్పతరులో ఉంది. అది మంచి బిల్డర్లలో ఒకరు. మీరు ఐటీ నిపుణురాలు, ఎంబీఏ కూడా చేశారు. మీకు మంచి డిమాండ్ ఉంది. బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎందుకు ఉద్యోగం చేయకూడదు? మీ వివాహం జరిగి కేవలం 18 నెలలే అయింది. ఇప్పుడు మీకు BMW కూడా కావాలా? 18 నెలల వివాహం కోసం మీరు నెలకు ఒక కోటి రూపాయల భృతి కోరుకుంటున్నారా?

లేడీ: అతను చాలా ధనవంతుడు. నాకు స్కిజోఫ్రెనిక్ అనిపించుకుని విడాకులు తీసుకోవాలనుకుంటున్నాడు.

సీనియర్ అడ్వైజర్ మాధవి దివాన్: (భర్త తరపున నిలబడి) ఆమె కూడా పని చేయాలి. ప్రతిదీ ఇలా డిమాండ్ చేయకూడదు.
లేడీ: నేను స్కిజోఫ్రెనిక్‌గా కనిపిస్తున్నానా మై లార్డ్స్!
CJI గవాయ్: ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయండి. కానీ మీరు అతని తండ్రి ఆస్తులను కూడా క్లెయిమ్ చేయలేరని అర్థం చేసుకోండి.
లేడీ: నా భర్త నా న్యాయవాదిని ప్రభావితం చేశాడు.
సీజేఐ: ఎవరిని ప్రభావితం చేశాడు?? మీరు ఆ ఫ్లాట్‌తో సంతృప్తి చెందండి లేదా 4 కోట్లు తీసుకొని మంచి ఉద్యోగం చూసుకోండి.
లేడీ: వారు నాపై అభియోగాలు మోపారు..FIR కూడా నమోదు చేశారు. అలాంటప్పుడు ఏ ఉద్యోగం వస్తుంది?
సీజేఐ: మేం దానిని కూడా రద్దు చేస్తాం. కానీ జీవితాన్ని మీరు కూడా నిలబెట్టుకోవాలి.

ఇలా చాలా ఆసక్తికరంగా సాగింది సుప్రీంకోర్టులో విచారణ. పిటిషనర్ అయిన మహిళ డిమాండ్లను విని అవాక్కయిన చీఫ్ జస్టిస్.. చివరికి ఆమె కోరికలకు కళ్లెం వేస్తూ..భర్త ఇచ్చే భరణంతోపాటు తన పోషణకు తాను కూడా  పనిచేయాలని ఆ మహిళను ఆదేశించారు.   

►ALSO READ | కేరళ నర్స్ నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు: యెమెన్ నుంచి కేఏ పాల్ వీడియో రిలీజ్