
ఇండియా-పాకిస్తాన్ అండర్19 మ్యాచ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఇండియన్ బౌలర్ బిష్ణోయ్ వేసిన 31వ ఓవర్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. పాకిస్తాన్ బ్యాట్‌మెన్ అక్రమ్.. బిష్ణోయ్ వేసిన బంతిని కొట్టి సింగిల్‌కు రావాల్సిందిగా నాన్ స్ట్రయికింగ్‌లో ఉన్న పాక్ కెప్టెన్ నాజిర్‌ను కోరాడు. కానీ, బాల్ డైరక్ట్‌గా ఫీల్డర్ దగ్గరికి వెళ్లడంతో నాజిర్ రన్ కోసం వెళ్లకుండా వెనుదిరిగాడు. కానీ, అప్పటికే అక్రమ్ నాన్ స్ట్రయికింగ్ క్రీజ్ దగ్గర్లో ఉన్నాడు. దాంతో ఇద్దరు బ్యాట్‌మెన్స్ నాన్ స్ట్రయికింగ్ క్రీజ్‌కి చేరారు. వెంటనే ఫీల్డర్ బంతిని కీపర్‌కి ఇవ్వడంతో స్ట్రయికింగ్ చేసిన అక్రమ్ అవుటయ్యాడు. ఇలా ఇద్దరు బ్యాట్‌మెన్స్ ఒకే క్రీజులోకి చేరడంతో కాసేపు స్టేడియంలో నవ్వులు విరబూశాయి. ఆ అవుట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతుంది.
#INDvsPAK Pakistan team running between the wicket ?? ?????? pic.twitter.com/0G5ma6LsFW
— Surender Meena (@surender9929) February 4, 2020