పాకిస్తాన్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కరాచీలో బస్సులో మంటలు చెలరేగి 21 మంది చనిపోయారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. చనిపోయినవారిలో ఎక్కువగా చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగస్టులో పాక్ ను వరదలు ముంచెత్తటంతో బాధితులను కరాచీలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో.. పునరావాస కేంద్రాల్లోని నిర్వాసితులు తిరిగి తమ స్వగ్రామాలకు వెళుతున్నారు. సింధ్ ప్రావిన్స్ లోని ఖైర్ పూర్, నాథన్ షా ప్రాంతాలకు చెందిన 45 మంది వరద బాధితులు తమ ఇళ్లకు వెళుతుండగా.. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఏసీ బస్సు కావటం.. కిటికీలన్నీ మూసి ఉండటంతో మంటల్లో కొందరు.. పొగతో ఊపిరాడక మరికొందరు చనిపోయారు. అయితే ఈ ఘనటకు గల కారణాలు తెలియాల్సివుంది.
