కోహ్లీ రికార్డును సమం చేసిన బాబర్ ఆజమ్

కోహ్లీ రికార్డును సమం చేసిన బాబర్ ఆజమ్

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్..విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 3 వేల పరుగులు చేసిన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు.  కోహ్లీ 81  ఇన్నింగ్స్ల్లో 3వేల పరుగులు చేయగా...బాబర్ ఆజమ్ కూడా 81 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో 87 పరుగులు చేయడం ద్వారా  బాబర్ టీ20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

బంతుల్లో తేడా..


టీ20ల్లో విరాట్ కోహ్లీ 3 వేల పరుగులు చేసేందుకు 2,169 బంతులు ఎదుర్కొన్నాడు. బాబర్‌ అజమ్‌ మాత్రం 2,317 బంతుల్లో 3వేల పరుగులు సాధించాడు. దీంతో  మ్యాచ్‌ల పరంగా బాబర్ కోహ్లీ రికార్డును సమం చేసినా.. బంతుల పరంగా మాత్రం బాబర్ కంటే కోహ్లీయే ముందున్నాడు. 

మూడో ప్లేస్లో గప్తిల్..

 


కోహ్లీ, ఆజమ్ తర్వాత టీ20ల్లో  తక్కువ ఇన్నింగ్స్ల్లో 3వేల పరుగులు చేసిన ఆటగాడిగా మార్టిన్ గప్తిల్ నిలిచాడు. గప్తిల్ 101 ఇన్నింగ్స్ లో 3వేల పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 108 ఇన్నింగ్స్ల్లో 3వేల పరుగులు కొట్టాడు. అయితే  కోహ్లీ కంటే రోహిత్‌ శర్మ 20 బంతులు తక్కువ తీసుకుని 3 వేల పరుగుల మార్క్‌ను అందుకోవడం విశేషం. రోహిత్ శర్మ 2149 బంతుల్లో 3వేల మార్కును చేరుకున్నాడు.  మార్టిన్‌ గప్టిల్‌ 2203 బంతుల్లో 36వేల పరుగులు సాధించాడు. వీరి తర్వాత  పాల్‌ స్టిర్లింగ్‌ 2226 బంతుల్లో 3వేల పరుగులు చేశాడు.