పాకిస్తాన్ లో వరదలు..50 మంది మృతి

పాకిస్తాన్ లో వరదలు..50 మంది మృతి
  • వర్షాలతో దాదాపు 40 లక్షల మంది ఎఫెక్ట్

లాహోర్: పాకిస్తాన్​ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా పంజాబ్ ప్రావిన్స్‌‌‌‌లో గత నెల 23 నుంచి ఇప్పటి వరకు వరదల కారణంగా 50 మంది మృతి చెందారు. దాదాపు 40 లక్షల మంది ప్రభావితమయ్యారని శనివారం అధికారులు వెల్లడించారు.  సుమారు 13 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రావిన్స్‌‌‌‌లో ఆగస్టు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

దీంతో దాదాపు అన్ని నదులు, ఉపనదులు ప్రమాద స్థాయిలను మించి ప్రవహిస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న దాదాపు 1.84 మిలియన్ల మందిని పంజాబ్ ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్ అథారిటీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

రావి, చీనాబ్, సట్లెజ్ నదుల వరద నీటిలో 3,900 గ్రామాలు మునిగిపోయాయని, వేల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. గండా సింగ్ వాలా, హెడ్ సులైమాంకి, హెడ్ ఖాదిరాబాద్, ఖాంకి, ముహమ్మద్‌‌‌‌వాలా వద్ద నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని వెల్లడించారు.