
శ్రీనగర్: పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడులపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఘాటుగా స్పందించారు. భారత్‌ది పిరికిపంద చర్య అని, పాక్ పౌరులు 8 మంది చనిపోయారని ఆయన ప్రకటించారు. ఇండియాలో తామ ఎప్పడు.. ఎక్కడ ఏం చేస్తామో చెప్పమని -పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పడం గమనార్హం.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతోపాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీవోకే, పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది.
పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్టు చేశారు.
— Ishaq Dar (@MIshaqDar50) May 6, 2025