Pakistan Halloween Rave : అడ్డంగా దొరికారు: కరాచీలో రేవ్ పార్టీ..స్కూల్ స్టూడెంట్స్ అరెస్ట్..

Pakistan Halloween Rave : అడ్డంగా దొరికారు: కరాచీలో రేవ్ పార్టీ..స్కూల్ స్టూడెంట్స్ అరెస్ట్..

ఓ పక్క ఆ దేశంలో దరిద్రం తాండవిస్తోంది..సగం జనాభాకు తిండి దొరకడంలేదు..ఆర్థికసంక్షోభంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా ఉంది.. ఇలాంటి సందర్భంలో  రేవ్ పార్టీలు.. అందులో స్కూల్ స్టూండెంట్స్..ఒళ్లు మరిచి నిషేధిత మత్తు పదార్థాలు, మద్యం సేవించి చిందులేస్తున్నారు. పాకిస్తాన్ లోని కరాచీలో హాలోవీన్ రేవ్ పార్టీకి  సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. 

కరాచీలో అర్థరాత్రి దాటాకా రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఓ బంగ్లాపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులో సమయంలో ఆ బంగ్లాలో ఉన్నవారంతా విద్యార్థులే.. విద్యార్థులంటే.. అందరూ స్కూల్ విద్యార్థులే.. మత్తుగా తూలుతున్నారు.. చిందులేస్తున్నారు..  సగం సగం దుస్తులతో అమ్మాయిలు గుప్ గుప్ అంటున్న మ్యూజిక్ కు తగ్గట్టు స్టెప్పులేస్తున్నట్లు వీడియోలో కనిపించింది.  సిగరెట్లు, మద్యం, నిషేధిత మత్తు పదార్థాలు ఆప్రాంతంలో కుప్పలుగా పడివున్నాయి. పోలీసులు రైడింగ్ లో అందరూ అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.. కొందరు దొరికారు.. మరికొందరు పారిపోయారు. 

రాత్రి 11 గంటలకు ప్రారంభమైన పార్టీ తెల్లవారుజాము 4 గంటల వరకు కొనసాగింది. ఈ పార్టీలో అబ్బాయిలు, అమ్మాయిలు పాల్గొన్నారు..పోలీసులు దాడులు చేయకపోతే ఇంకా కొనసాగేది. పార్టీలో పాల్గొన్న వారంతా మైనర్లే.. అందుకే ఈ వీడియోను వెంటనే సోషల్ మీడియానుంచి తొలగించాలని పాకిస్తాన్ కోర్టు ఆదేశించింది.

బంగ్లా ఓనర్ ఖలీద్ ఖాన్ గా గుర్తించారు పోలీసులు. పార్టీ నిర్వహించేందుకు ఖలీద్ ఖాన్ బంగ్లా ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో మైనర్లకు అయాన్ ఖాన్ అనే మరో వ్యక్తి నిషేదిత వస్తువులను ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటివరకు బంగ్లా ఓనర్ ను కానీ, నిషేధిత పదార్థాలు సరఫరా చేసిన వ్యక్తిని కానీ అరెస్ట్ చేసిన సమాచారం లేదు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు

Also Read :-ప్రేమ కోసం వచ్చింది.. జైలులో పడింది.. అయినా అతనంటే పిచ్చి అంట..