
- పాకిస్థాన్ దగ్గర అన్ని విమానాలూ ఉన్నాయట
పాక్ ఒక్క ఎఫ్ 16నూ పోగొట్టు కోలేదట.ఆ దేశం వద్ద ఉన్న ఆ విమానాల లెక్కల్లో తేడా రాలేదట. ఒకేసారి కాకుండా కొన్ని వారాల పాటు అమెరికా అధికారులు విమానాలను లెక్కబెట్టారట. అసలు ఇండియా,ఎఫ్ 16ను కూల్చనేలేదట. ఇదీ, అమెరికాకు చెందిన ఓ మేగజీన్ రాసిన కథనం. ఇటీవలే అమెరికా రక్షణ సిబ్బంది పాక్ వద్ద ఉన్నఎఫ్ 16 విమానాల లెక్క తేల్చారని ఆ దేశ ‘ఫారిన్ పాలసీ’ మేగజీన్ కు ఇద్దరు అధికారులు తెలిపారు. ‘భారత వైమానిక దళ అధికారులు చెబుతున్నట్టు వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ .. ఎఫ్ 16 విమానాన్ని కూల్చలేదు. డాగ్ ఫైట్ లో భాగంగా ఎఫ్ 16విమానాన్ని అభినందన్ లా క్ చేసి ఉంటారు.ఫైర్ చేసిన మిసైల్ టా ర్గెట్ ను ఛేదిం చిందని భావించి ఉంటారు” అని మేగజీన్ పేర్కొంది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో ఫైట్ లో ఎఫ్ 16 పాల్గొన్నదని అమెరికా అధికారులు తేల్చినట్టు చెప్పింది. ఎఫ్ 16 మాత్రమే పేల్చగలిగే ఏఐఎం120 ఎయిర్ టు ఎయిర్ మిసైల్ శక లాలు మా త్రం అక్కడ లభిం చాయని చెప్పింది. డాగ్ ఫైట్ జరిగి రెం డు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలున్న నేపథ్యంలో .. ఎఫ్ 16లను వాడి విదేశీ సైనిక కొనుగోళ్ల ఒప్పం దాలను పాకిస్థా న్ ఉల్లం ఘించిందేమో తేల్చాలంటూ అమెరికాను ఇండియా కోరిం దని నివేదికలో పేర్కొంది. అందులో భాగంగా పాక్ లోని ఎఫ్ 16లను లెక్కించడం కోసం అమెరికా అధికారులను పాక్ అనుమతించిందని తెలిపింది. ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని విమానాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకేసారి లెక్కించడం కు దరలేదని, అందుకే కొన్ని వారాల టైం తీసుకుని వాటి లెక్కతేల్చారని పేర్కొంది. అయితే, ఈ కథనంపై అమెరికా రక్షణ శాఖ స్పందించలేదు.