క‌శ్మీర్ లో పాక్ మ‌రో విష బీజం.. కొత్త టెర్ర‌రిస్టు గ్రూప్ సృష్టి: ఆర్మీ చీఫ్

క‌శ్మీర్ లో పాక్ మ‌రో విష బీజం.. కొత్త టెర్ర‌రిస్టు గ్రూప్ సృష్టి: ఆర్మీ చీఫ్

భార‌త దేశంలో ఉగ్ర‌ దాడులు చేయ‌డ‌మే సృష్టించ‌డ‌మే ల‌క్ష్యంగా పాకిస్థాన్ నిత్యం కుట్ర‌లు ప‌న్నుతూనే ఉంది. మ‌న దేశంపై ద్వేషంతో ల‌ష్క‌రే, జైషే వంటి టెర్ర‌రిస్టు సంస్థ‌ల‌ను త‌యారు చేసి ఉసిగొల్పుతున్న దాయాది దేశం.. క‌శ్మీర్ లోయ‌లో అల్ల‌క‌ల్లోలం సృష్టించేందుకు మ‌రో విష బీజం నాటింది. క‌శ్మీర్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి టెర్ర‌రిస్టు సంస్థ‌ల‌ను భార‌త ఆర్మీ తుడిచిపెట్టేస్తుండ‌డంతో రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరుతో కొత్త టెర్ర‌ర్ గ్రూప్ ను త‌యారు చేసింది. ఈ విష‌యాన్ని పసిగ‌ట్టిన భార‌త ఆర్మీ.. పాక్ ప‌న్నాగాల‌ను చెక్ పెట్టేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామ‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ చీఫ్ మ‌నోజ్ ముకుంద్ దీని గురించి చెప్పారు. క‌శ్మీర్ లోపాకిస్థాన్ కొత్త‌గా రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరుతో కొత్త ఉగ్ర‌వాద సంస్థ‌ను క్రియేట్ చేసింద‌ని తెలిపారు. అయితే దీనిని తాము టెర్ర‌ర్ రివైవ‌ల్ ఫ్రంట్ గా పిలుస్తామ‌న్నారు. ఇలాంటి ఉగ్ర‌ మూక‌ల‌ను భార‌త సేన‌లు స‌మ‌ర్థంగా అంత‌మొందిస్తాయ‌ని, క‌శ్మీర్ లో ఎలాంటి ముష్క‌ర శ‌క్తులు ప్ర‌వేశించ‌కుండా చేస్తాయ‌ని చెప్పారు.

వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్లే..

ఇటీవ‌ల క‌శ్మీర్ లో వ‌రుస‌గా ఉగ్ర‌వాదుల ఎన్ కౌంట‌ర్ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డానికి కార‌ణంగా వాతావ‌ర‌ణ మార్పులేన‌ని చెప్పారు ఆర్మీ చీఫ్ మ‌నోజ్ ముకుంద్. చ‌లికాలం ముగిసిన త‌ర్వాత పాక్ ఉగ్ర‌వాదుల చొర‌బాట్లతో పాటు ముష్క‌రుల క‌ద‌లిక‌లు పెరుగుతాయ‌ని, దీంతో ఆర్మీ కౌంట‌ర్ ఆప‌రేష‌న్లు కూడా ఎక్కువ‌గా ఉంటాయ‌ని అన్నారు. క‌శ్మీర్ అంశాన్ని అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప్ర‌స్తావించి మ‌ద్ద‌తు కోసం పాక్ చేసే ప్ర‌య‌త్నాల‌ను ఏ దేశాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. క‌శ్మీర్ లో ఏదో జ‌రిగిపోతోంద‌ని ప్ర‌పంచ దేశాలకు భ్ర‌మ క‌ల్పించేందుకు పాక్ తీవ్ర‌మైన ఉన్మాదానికి పాల్ప‌డం చాన్స్ ఉంద‌న్నారు. అయితే భార‌త సైన్యం ఎటువంటి దుర్ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా నిలువ‌రించేందుకు పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ఉంద‌ని చెప్పారు ఆర్మీ చీఫ్‌. ముష్క‌రుల చొర‌బాట్ల‌కు చెక్ పెట్టేందుకు కౌంట‌ర్ ఆప‌రేష‌న్లు ఎప్ప‌టికప్పుడు అప్ డేట్ చూస్తూనే ఉంటామ‌న్నారు.