భారత్ దెబ్బకు ఇంకా కోలుకోని పాక్.. ధ్వంసమైన రన్‌‌‌వేలు, హ్యాంగర్లు ఇప్పటికీ రిపేర్ కాలే

 భారత్ దెబ్బకు ఇంకా కోలుకోని పాక్..  ధ్వంసమైన  రన్‌‌‌వేలు, హ్యాంగర్లు ఇప్పటికీ రిపేర్ కాలే
  • పాక్ ఎయిర్​బేస్​లు పదింటిపై దాడి
  •     పూర్తిగా ధ్వంసమైన నూర్ ఖాన్, జాకోబాబాద్‌‌‌‌లో రన్‌‌‌‌వేలు, హ్యాంగర్‌‌‌‌లు
  •     ఇప్పటికీ రిపేర్లు చేసుకోని పాక్.. తాజా శాటిలైట్ ఫొటోల్లో వెల్లడి

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌‌‌‌లో భాగంగా భారత్ చేసిన దాడుల నుంచి పాకిస్తాన్‌‌‌‌కు ఇంకా కోలుకోలేదు. ఆరు నెలలు అవుతున్నా ఆ దెబ్బల ప్రభావం నుంచి ఆ దేశం ఇంకా బయటపడలేని బలహీన స్థితిలో ఉంది. ఎటాక్స్​లో ధ్వంసమైన పాక్ ఎయిర్​బేస్ ల రిపేర్లు ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ విషయాన్ని తాజా శాటిలైట్ ​ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. 

పహల్గాం టెర్రర్ ఎటాక్​ నేపథ్యంలో 2025 మేలో భారత్​ పాకిస్తాన్​పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్​లోని ఉగ్రవాదుల స్థావరాలు, ఆ దేశానికి సంబంధించిన 10 ఎయిర్​బేస్​లపై భారత్‌‌‌‌ దాడి చేసింది. రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్​బేస్​ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. మురీద్, రాఫిక్వీ, ముషాఫ్, భోలారి, ఖద్రీం, సియాల్‌‌‌‌కోట్, సుక్కూర్, జాకోబాబాద్ ఎయిర్​బేస్​లు కూడా దాడుల్లో ధ్వంసమయ్యాయి. మన ఎయిర్​ఫోర్స్​ చేసిన దాడిలో పాక్ ఎయిర్​బేస్​లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

దాడులతో భారీ ఎఫెక్ట్​

భారత్ ఆపరేషన్​తో పాక్​కు భారీ నష్టం వాటిల్లింది. నూర్ ఖాన్‌‌‌‌ ఎయిర్​బేస్ తీవ్రంగా దెబ్బతిన్నది. అక్కడి హ్యాంగర్‌‌‌‌లు, రన్‌‌‌‌వేలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జాకోబాబాద్‌‌‌‌లో హ్యాంగర్ రూఫ్ కూలింది. పాక్ సైనిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. విమానాలు, సంబంధిత సామగ్రిని చాలావరకు నష్టపోయింది. ఈ దాడుల్లో భారత్ ఖచ్చితంగా లక్ష్యాలను గురిచూసి కొట్టింది. దీంతో పాక్ రక్షణ వ్యవస్థలు ఎంత బలహీనమైనవో ప్రపంచానికి తెలిసింది.

పూర్తికాని ఎయిర్​బేస్​ల రిపేర్

భారత్ ఆపరేషన్ సిందూర్​ చేపట్టి దాదాపు ఆరు నెలలు అవుతున్నది. అయితే, పాక్ ఇంకా తమ ఎయిర్​బేస్​లను మరమ్మత్తు చేస్తూనే ఉన్నది. నూర్ ఖాన్‌‌‌‌లో కొత్త ఫెసిలిటీలను నిర్మిస్తున్నారు. అలాగే దాడి జరిగిన స్థలంలో పనులు కొనసాగుతున్నాయి. జాకోబాబాద్‌‌‌‌లో కూడా మరమ్మత్తు పనులు లేటు అవుతున్నాయి. తాజా శాటిలైట్ ఫొటోలతో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్ దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదని.. అలాగే ఆ దేశంలోని ఇతర ఎయిర్​బేస్​ల రిపేర్ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని తేలింది. నిధుల కొరత, సామర్థ్య లోపం, సరైన సాంకేతికత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నది.