కులభూషణ్ జాదవ్ కు లాయర్ ఏర్పాటుకు పాక్ కోర్టు సానుకూలం

కులభూషణ్ జాదవ్ కు లాయర్ ఏర్పాటుకు పాక్ కోర్టు సానుకూలం

గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ జైలులో మగ్గుతూ మరణశిక్ష ఎదుర్కొంటున్న కుల్ భూషణ్ జాదవ్ కు లాయర్ ను ఏర్పాటు చేయడంపై ఇస్లామాబాద్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. జాదవ్ కు న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకు భారత్ కు అనుమతి ఇవ్వాలంటూ పాక్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జాదవ్ కు న్యాయవాదిని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై ఇస్లామాబాద్ హైకోర్టు ఇవాళ(సోమవారం,ఆగస్టు-3) విచారణ చేపట్టింది. పాక్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేసింది.