డాలర్ల కోసం దేశ ప్రతిష్టను పణంగా పెట్టినం

డాలర్ల కోసం  దేశ ప్రతిష్టను పణంగా పెట్టినం

ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్ లో ఉగ్రవాదంపై రెండు దశాబ్దాల పాటు అమెరికా జరిపిన పోరులో తమ దేశం పాలుపంచుకోవడం మీద పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా.. డాలర్ల కోసమే యూఎస్ తో తమ దేశం చేతులు కలిపిందన్నారు. ఇస్లామాబాద్ లో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ విషయంలో యూఎస్ తో కలసి ముందుకెళ్లాలని 2001లో నిర్ణయం తీసుకున్న వారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పారు. 

‘అప్పటి పరిస్థితులపై నాకు అవగాహన ఉంది. ఇతరులు మనల్ని వాడుకునేందుకు నాడు మనమే ఛాన్స్ ఇచ్చాం. ఇందుకు దేశ ప్రతిష్టను కూడా పణంగా పెట్టాం. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, డబ్బు కోసం విదేశాంగ విధానాన్ని రూపొందించాం. అఫ్గాన్ లో పోరాటం మనకు మనమే చేసుకున్న గాయం. ఇందుకు ఎవర్నీ నిందించలేం’ అని ఇమ్రాన్ అన్నారు. అఫ్గాన్ లో ఉగ్రవాదంపై పోరాటం తమకు తీవ్ర నష్టం కలిగించిందని ఇమ్రాన్ అన్నారు. 20 ఏళ్ల యుద్ధం వల్ల పాక్ లో 80 వేల మరణాలు సంభవించాయని.. ఆర్థికంగా తమ దేశం 100 బిలియన్ డాలర్లు నష్టపోయిందని ఆయన అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

రెంజిత్​ లైఫ్​ మార్చేసిన రెడీమేడ్​ చపాతీ

నేను ఏ పాత్ర చేసినా రిస్ట్రిక్షన్స్ ఉండవ్

జుట్టు బాగా పెరగాలంటే తలకి నూనె పెట్టాలా ?