నేను ఏ పాత్ర చేసినా రిస్ట్రిక్షన్స్ ఉండవు

నేను ఏ పాత్ర చేసినా రిస్ట్రిక్షన్స్ ఉండవు

     తెలుగులో నటించింది ఏడే సినిమాలు. అందులో రెండు ఇంకా రిలీజ్ కాలేదు. కానీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మాత్రం చెరగని స్థానం ఏర్పరచుకుంది సాయిపల్లవి. ఈ ఏడాది ఆల్రెడీ ‘లవ్‌‌ స్టోరీ’తో పలకరించిన ఆమె, ఈ నెల 24న  ‘శ్యామ్‌‌ సింగరాయ్‌‌’తో వస్తోంది. ఈ సందర్భంగా ‘సాయిపల్లవి’ చెప్పిన సంగతులు.

   ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత నానితో చేస్తున్న సినిమా ఇది. అందులో రియల్‌‌ లైఫ్‌‌లో ఎలా ఉంటానో అలాగే కనిపించాను. కానీ ఈ మూవీలో మా క్యారెక్టర్స్ డిఫరెంట్‌‌. లవ్‌‌ సీన్స్ డీప్‌‌గా ఉంటాయి. సినిమాలో లాస్ట్ సీన్‌‌ని మొదటే షూట్ చేసేశారు. దాంతో ఎలా చేయాలో తెలియలేదు. దర్శకుడు చెప్పింది ఫాలో అయ్యామంతే. 
   స్కూల్‌‌లో దేవదాసీ వ్యవస్థ గురించి కొంత చదువుకున్నాం. ఈ సినిమాలో వాళ్ల సైకాలజీ గురించి చర్చించడం నచ్చింది. మొదట్లో వాళ్లు దైవ సేవకులు. తర్వాత ఆ పద్ధతి మారింది. ఇదేమీ దేవదాసీ వ్యవస్థపై తీసిన సినిమా కాదు. శ్యామ్ సింగ రాయ్ పాత్రే కీలకం. తనతో పాటు దేవదాసీల గురించి ఎంత చూపించాలో అంతే చూపించారు. 
  స్క్రిప్ట్ చదివేటప్పుడే కాన్సెప్ట్‌‌ ఎలా ఉంటుంది, మన క్యారెక్టర్ ఎలా చేయొచ్చు అని ఓ ఐడియా వచ్చేస్తుంది నాకు. పాత్రకి కనెక్ట్ అయితేనే నటన బాగుంటుంది. లేదంటే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇందులోని పాత్రలో నేను కాకుండా దేవదాసీనే కనిపిస్తుంది. ఏ పాత్రయినా చేసేటప్పుడు నా నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే ఏ సినిమాకైనా స్క్రిప్ట్ చదివే కదా సైన్ చేస్తాం. 
    నేను నటిస్తే ఆ కథ, క్యారెక్టర్‌‌‌‌పై అంచనాలు పెరుగుతున్నాయని ఎవరైనా చెబితే భయమేస్తుంది. ప్రేక్షకురాలిగా ఆ సినిమాని నేనైతే ఎంజాయ్ చేస్తానా లేదా అని చూసుకునే సైన్ చేస్తాను. ‘ఎంసీఏ’  టీమ్‌‌లో కొందరు పల్లవి అన్‌‌కంఫర్టబుల్‌‌గా ఫీలయ్యిందన్నారు. రెగ్యులర్ క్యారెక్టర్ ఒకటి చేసి చూద్దామని ఆ సినిమా చేశా. కానీ చేసేటప్పుడే నాకూ అర్థమైంది.. అలాంటి పాత్రల్లో నేను కంఫర్టబుల్ కాదని. 
    నా బ్రెయిన్ లో నేను మామూలు సాయిపల్లవినే. కాకపోతే నేను చేసే పని ఎంతోమందికి సంతోషాన్నిస్తోందని తెలిసి ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌లో కొంత ఎమోషనల్ అయ్యాను. అది నా గ్రాటిట్యూడ్. ‘విరాటపర్వం’లో నా పార్ట్ పూర్తయింది. డబ్బింగ్ చెప్పాలి. తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. డిటెయిల్స్‌‌ త్వరలో రివీల్ అవుతాయి.

‘లవ్‌‌ స్టోరీ’ సినిమా అంతా నాకు డ్యాన్స్ ఉంటుంది. ఇందులో మాత్రం పాత్రకి ఎంత కావాలో అంతే ఉంటుంది. అదీ ఓ పాటలో క్లాసికల్ డ్యాన్స్ చేస్తానంతే. నేనది నేర్చుకో లేదు. అయినా చేయగలనని నమ్మారు డైరెక్టర్. నాతో కలిసి డ్యాన్స్ చేసిన వాళ్లంతా క్లాసికల్‌‌ డ్యాన్స్‌‌లో పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవాళ్లు. దాంతో చాలా భయపడ్డాను. కానీ వాళ్లలాగే చేశాననడంతో అదే పెద్ద సక్సెస్ అనుకున్నాను.