సింధూ జలాలను మళ్లించే నిర్మాణాన్ని పేల్చేస్తం .. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే కామెంట్లు

సింధూ జలాలను మళ్లించే నిర్మాణాన్ని పేల్చేస్తం .. పాక్  రక్షణ మంత్రి రెచ్చగొట్టే కామెంట్లు

న్యూఢిల్లీ: పాకిస్తాన్​కు వచ్చే సింధూ జలాల నీళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్​ భారత్​ను హెచ్చరించారు. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణాన్నైనా పేల్చివేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పాక్​లో ఓ టీవీ చానెల్​లో ఆయన మాట్లాడారు. సింధూ జలాలను మళ్లించే ఏ ప్రయత్నమైనా తమ దేశంపై దురాక్రమణగానే చూస్తామన్నారు. ఇండస్  బేసిన్​లో భారత్ డ్యామ్​లు కడితే అది పాక్​పై దురాక్రమణే అని, అలాంటి నిర్మాణాలను పేల్చివేస్తామని పేర్కొన్నారు. 

కాగా.. ఖవాజా రెచ్చగొట్టే వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. పాకిస్తాన్ ఎంతగా భయపడుతున్నదో ఖవాజా మాటల్లో అర్థమవుతోందని బీజేపీ జాతీయ ప్రతినిధి షాన్ వాజ్  హుస్సేన్ కౌంటర్  ఇచ్చారు. పాక్​కు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నా.. ఆయనకు ఏమాత్రం నియంత్రణ లేదని, ఆయన కేవలం ఓ స్టేట్​మెంట్ల మినిస్టర్  అని షాన్ వాజ్  ఎద్దేవా చేశారు.  సింధూ జలాలను అడ్డుకోవడంతో శత్రు దేశంలో భయం మొదలైందని, వారికి రాత్రిపూట నిద్రకూడా పట్టడం లేదని చురకలంటించారు.