
రోడ్డుకట్టర్ తో ఇంజన్ , ఆటో చక్రాలతో గిల్లలు,నార బస్తాతో రెక్కలు.. విమానమిది. గాలిమోట-ర్ ఎక్కాలన్న అతడి కల తీరేది కాదు. పేలాలమ్ముకునే వ్యక్తికి అది కష్టం కదా. వచ్చే పైసలు తిండికీ సరిపోవాయే. మరి, విమానమెక్కాలన్న కల తీరేది ఎట్ల? తయారు చే సుకుం టే పోలే.. ఇదే ఆలోచన వచ్చింది అతడికి. అనుకున్నదే తడువుగా దానిని తయారుచేశాడు. ఆ వ్యక్తి పేరు మహ్మద్ ఫయాజ్ . పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న తాబూర్ అతడి ఊరు. అతడు తయారు చేసిన విమానాన్ని చూసి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ తెగ పొగిడేసింది. జనానికీ ఆ పేదవాడికసి, పట్టుదల నచ్చాయి.
పాకిస్థా న్ లో చదువుకునోచుకోక, అవకాశాల్లేక బతుకు కోసం పోరాడుతున్న చాలా మంది కథను అది కళ్లకు కడుతోందని అంటున్నారు. తాను తయారు చేసిన విమానం గాల్లోకి ఎగిరిందని ఫయాజ్ చెప్పాడు. ఆయన పనితనం మెచ్చిన పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అతడి ఇంటికి వెళ్లి విమానాన్ని చూసింది. బాగుందంటూ సర్టిఫికెట్ కూడాఇచ్చింది. ఎయిర్ ఫోర్స్ లో చేరాలన్న కల చిన్ననాటి నుంచి ఉండేదని, కానీ, తన చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో చదువు ఆగిపోయిం దని చెప్పాడు. తల్లి,ఐదుగురు తమ్ముళ్లు, చెల్లెళ్లను పోషించడానికి ఎన్నెన్నో పనులు చేశానని ఆవేదన చెందాడు.
పొద్దంతా పేలాలు అమ్ముకోవడం, రాత్రయితే సెక్యూరిటీగార్డుగా కాపలా ఉండడం.. ఇదీ పొట్ట నింపుకోవడానికి అతడు చేస్తున్న కాయాకష్టం . విమానం తయారు చేయాలన్న కల బాగానే ఉంది కానీ, మరి దాన్ని ఎలాచేయాలి? అందుకు నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్లో వచ్చే ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ ను చూసేవాడు. పైసలు కూడా కావాలి కదా. తన పొలంలోని కొద్ది భాగాన్ని అమ్మాడు. సరిపోలేదు. మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.50 వేలు లోన్ తీసుకున్నాడు . అక్కడి నుంచి మొదలైంది అతడి ప్రయోగం. ఇంట్లో వాళ్లు మాత్రం అతడికి పిచ్చి పట్టిందా అని తిట్టే వాళ్లు. పాకిస్థాన్ డే అయిన మార్చి 23న దానిని ఆవిష్కరించాలనుకున్నాడు. జనం అందరూ అతడి విమానం చుట్టూ ఆ దేశజెండాలు పట్టుకుని నిలబడ్డారు. విమానం ఎక్కాల్సి న ఫయాజ్ పోలీస్ జీపు ఎక్కాడు . అవును, పోలీసులు అతడిని అరెస్ట్ చేసి నేరగాళ్లుండే లాకప్ లో పడేశారు. విమానాన్ని స్వాధీనం చేసుకున్నా రు. తర్వాత రూ.3 వేలజరిమానాతో కోర్టు అతడిని వదిలేసింది. పోలీసులు విమానాన్ని తిరిగిచ్చేశారు. తన కలను గాల్లో ఎగిరేలాచేశాడు ఫయాజ్ . జనం జేజేలు పలికారు. పీఏఎఫ్ రెండుసార్లు అతడి వద్దకు వెళ్లింది.