మా పాకిస్తాన్ వాళ్లు పిరికిపందలు.. మా దగ్గర తుపాకులు కూడా లేవు : పాకిస్తాన్ వ్యక్తి వీడియో వైరల్

మా పాకిస్తాన్ వాళ్లు పిరికిపందలు.. మా దగ్గర తుపాకులు కూడా లేవు : పాకిస్తాన్ వ్యక్తి వీడియో వైరల్

మా పాకిస్తాన్ దేశంలో రక్షణ వ్యవస్థ దరిద్రంగా ఉంది.. మా సైనికులు పిరికిపందలు.. ఇండియా దాడి చేస్తే కనీసం అడ్డుకోలేకపోయారు.. మా రక్షణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది.. మాటలు తప్పితే చేతల్లో ఏమీ లేదు అంటూ పాకిస్తాన్ ఆర్మీ బలహీనతను.. డొల్ల తనాన్ని చెబుతూ పాకిస్తాన్ వ్యక్తి చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

ఇండియా 24 క్షిపణులను ప్రయోగిస్తే.. ఒక్క దాన్ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిందని.. ఇండియా 100 పర్సంట్ స్ట్రయిక్ రేటుతో విజయవంతంగా దాడి చేస్తే.. పాకిస్తాన్ చూస్తూ ఉందంటూ అతను చెప్పటం విశేషం. భారత్ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయ్యిందని చెబుతూనే.. పాక్ రక్షణ వ్యవస్థ బలహీనతలను పాకిస్తాన్ వ్యక్తం చెప్పటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ఈ వీడియో ఇండియాకు అనుకూలంగా ఉండటమే కాకుండా.. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ.. ఆర్మీ బలహీనతలను బయటపెట్టిందని నెటిజన్లు అంటున్నారు. ఇజ్రాయెల్ దేశంపై శత్రువులు దాడి చేస్తే అందులో 90 శాతం క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకుందని.. పాకిస్తాన్ మాత్రం చేతులు ఎత్తేసిందని.. పాక్ రక్షణ వ్యవస్థ అసలు ఏమీ చేయటం లేదని.. అంత శక్తి సామర్థ్యాలు కూడా పాక్ దగ్గర లేవంటూ ఈ పాకిస్తాన్ వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

Also Read : 100 మందిని లేపేశాం.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు

ఇండియా ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఉగ్ర శిబిరాలు అని.. అదే పాక్ ఆర్మీ స్థావరాలు, క్యాంప్స్, కంటోన్మెంట్ ఏరియాలు, సైనిక స్థావరాలు అయ్యి ఉంటే పరిస్థితి ఏంటనే అతి పెద్ద భయాన్ని సైతం అతను వెల్లడించటం విశేషం. భారత్ ఎంతో కచ్చితత్వంతో.. 24 క్షిపణులను ప్రయోగించిందని.. పాక్ ఆర్మీ స్థావరాలను లక్ష్యం చేసుకోకపోవటం అనేది పాకిస్తాన్ కు కలిసి వచ్చిందని.. రాబోయే రోజుల్లో ఇదే స్థాయిలో.. భారత్ పాక్ ఆర్మీ క్యాంప్స్ ను లక్ష్యం చేసుకుంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలంటూ పాకిస్తాన్ వ్యక్తి అతను చెప్పటం.. ఇప్పుడు షాకింగ్ గా మారింది. 

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ కు చెందిన జెట్ యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చినట్లు పాకిస్తాన్ చెబుతోందని.. ఇందులో వాస్తవం లేదని కూడా అంటున్నారు అతను. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలు మూడేళ్ల క్రితం నాటివి అని.. పాత వీడియోలను ఇప్పుడు పాకిస్తాన్ దేశం కొత్తవిగా.. ఇప్పుడు జరిగినట్లు చూపించటాన్ని తప్పుబట్టారాయన. 

మొత్తానికి పాకిస్తాన్ ఆర్మీ ఎంత బలహీనంగా ఉంది.. ఎంత దుర్భర స్థితిలో ఉందనేది పాకిస్తాన్ వ్యక్తి మాటల్లో స్పష్టం అయ్యింది.