100 మందిని లేపేశాం.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : రాజ్ నాథ్ సింగ్

100 మందిని లేపేశాం.. ఆపరేషన్ సిందూర్  ఇంకా ముగియలేదు : రాజ్ నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని   రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నారు.

ఆపరేషన్ సిందూర్ పై ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ పై పూర్తి వివరాలను అఖిలపక్షనేతలకు వివరించారు రాజ్ నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆపరేషన్ కొనసాగుతున్నందున ఇంతకు మించి వివరాలు బయటకు చెప్పలేమన్నారు. ఆపరేషన్ సిందూర్ లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  అయితే దీనిపై  ఇంకా పూర్తి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు.

Also Read : వాళ్లను వాళ్లే చంపుకుంటున్నారు

దేశభద్రత విషయంలో కేంద్రానికి తమ మద్దతు ఎపుడూ ఉంటుందని లోక్ సభప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అఖిల పక్ష సమావేశంలో ప్రధానమంత్రి గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సమావేశాలకు కూడా మోదీ హాజరుకాలేదు..కానీ ఈ సమయంలో  తామెవర్నీ విమర్శించడం లేదన్నారు ఖర్గే.

 దేశభద్రత విషయంలో అన్ని పార్టీల నాయకులు మద్దతిచ్చారని కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు అన్నారు. భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారని చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు చెప్పింది తాము విన్నాం..కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించాయని అన్నారు.