
పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్ మసీదులో సోమవారం జరిగిన సూసైడ్ బాంబర్ దాడిలో చనిపోయినవారి సంఖ్య 100కు చేరింది. రెస్క్యూ టీంలు శిథిలాల కింది నుంచి మరిన్ని డెడ్‌బాడీలను వెలికితీశాయి. హైసెక్యూరిటీ పోలీస్ లైన్స్ ప్రాంతంలోని మసీదులో తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) టెర్రర్గ్రూప్ఈ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మొత్తం 100 మంది చనిపోగా, మరో 221 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన రెండు వందల మందికి పైగా బాధితులను లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించామని, వీరిలో సుమారు వంద మంది ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారని, మిగిలిన వారు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
పడవ ప్రమాదంలో చనిపోయినోళ్లు 48 మంది..
పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 48కి చేరింది. ఆదివారం ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలో గల తాండా డ్యామ్ సరస్సులో పడవ బోల్తా పడి పది మంది మదర్సా స్టూడెంట్స్చనిపోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత మంగళవారం మరో 18 మంది డెబ్బాడీలను రెస్క్యూ అధికారులు వెలికితీశారు. ఇంకా మిగిలిన స్టూడెంట్స్ కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారని పోలీసులు తెలిపారు. సోమవారం నలుగురు స్టూడెంట్స్‌ను సరస్సు నుంచి రక్షించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బోట్లో మదర్సాకు చెందిన స్టూడెంట్స్, స్టాఫ్ ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ తాత్కాలిక సీఎం అజం ఖాన్ బాధిత కుటుంబాలకు సాయం అందించాలని లోకల్ అధికారులను ఆదేశించారు.