మెంటల్‌ టార్చర్‌ చేస్తున్నరు.. ఇక ఆడను

మెంటల్‌ టార్చర్‌ చేస్తున్నరు.. ఇక ఆడను

క్రికెట్‌‌కు పాకిస్తాన్​ పేసర్‌‌ ఆమిర్‌‌ గుడ్‌‌బై..  అతనికి ఆడే ఉద్దేశమే లేదన్న పీసీబీ

కరాచీ: పాకిస్తాన్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ అమిర్‌‌  తన ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌కు అనూహ్య రీతిలో ముగింపు పలికాడు. పాకిస్తాన్‌‌ క్రికెట్‌‌ బోర్డు(పీసీబీ)తోపాటు టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ చేస్తోన్న మెంటల్‌‌ టార్చర్‌‌ను భరించలేక రిటైర్మెంట్‌‌ తీసుకుంటున్నట్టు గురువారం వెల్లడించాడు. లంకన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌(ఎల్‌‌పీఎల్‌‌) కోసం ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న 28 ఏళ్ల ఆమిర్‌‌.. పాక్‌‌కు చెందిన ఓ వెబ్‌‌సైట్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నిర్ణయం ప్రకటించాడు. అయితే, ఆమిర్‌‌కు ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌  ఆడే ఉద్దేశమే లేదని, రిటైర్మెంట్‌‌ అతని వ్యక్తిగత నిర్ణయమని పీసీబీ తన ప్రకటనలో పేర్కొంది. 2009లో ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లోకి అడుగుపెట్టిన ఆమిర్‌‌..36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20ల్లో పాక్‌‌కు ప్రాతినిధ్యం వహించాడు.  కెరీర్‌‌ ప్రారంభం నుంచి ఆమిర్‌‌ ఎప్పుడూ వివాదాల్లోనే ఉన్నాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌‌కు పాల్పడి 2010-2015 మధ్య ఐదేళ్ల బ్యాన్‌ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జట్టు లోకి రీఎంట్రీ ఇచ్చినా గతేడాది లాంగ్‌ ఫార్మాట్‌ నుంచి తప్పుకున్నాడు.

For More News..

కొత్త ఏడాదిలో మస్త్ జాబ్స్

చైనాకు చేరిన చంద్రుడి మట్టి, రాళ్లు

బెంగాల్‌‌‌‌ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌‌‌‌