
న్యూఢిల్లీ: పాకిస్థా న్ జనం దృష్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (భారత వైమానిక దళం – ఐఏఎఫ్ ) మీద పడినట్టుంది. అందుకే ‘గూగుల్ .. ఐఏఎఫ్ గురించి చెప్పు’ అంటూ తెగ వెతికేస్తున్నారు. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్ ) కన్నా కూడా ఐఏఎఫ్ గురించే ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేశారని గూగుల్ ట్రెండ్స్ చెబుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్, బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్, ఎల్వోసీ వంటి ట్రెండింగ్ సబ్జెక్టుల్లో పాక్ జనం పీఏఎఫ్ కన్నా ఎక్కువ ఐఏఎఫ్ పైనే గురి పెట్టినట్టు గూగుల్ ట్రెండ్స్ లో తేలింది. మొత్తంగా ఎక్కువ సెర్చ్ లు బాలాకోట్ పైనే జరిగాయి. ఉదయం 7.40 గంటల నుంచి బాలాకోట్ ట్రెండ్ బాగా నడిచేసిందట. పాకిస్థాన్ ఆర్మీతో పోల్చినా ఇండియన్ ఆర్మీ గురించే ఎక్కువ సెర్చ్ చేశారట. ఇండియాలో మాత్రం సర్జికల్ స్ట్రైక్ గురించి ఎక్కువ వెతికారు.