
పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది.. పహల్గాంలో ఉగ్రమూకలు దాడి తరువాత .. భారత్ ప్రతి చర్యకు పాక్‌కు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకాలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన దాయాది దేశాధినేతలు... దిగి వచ్చారు. విదేశాల్లో పర్యటిస్తున్నపాక్ప్రధాని భారత్ తో శాంతి చర్చలు జరిపేందుకు సిద్దంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
ఇరాన్ లో పర్యటిస్తున్న పాక్ ప్రధాని షరీఫ్.. మాట్లాడుతూ.. భారత్ తో తాము శాంతి ఒప్పందాలు చేసుకునేందుకు సిద్దంగా ఉన్నమని ప్రకటించారు. ఉగ్రవాద సమస్య.. జమ్మూకాశ్మీర్.. సింధూ జలాల వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చించేందుకు రడీ గా ఉన్నామని ప్రకటించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తేల్చి చెప్పారు. ఇండియాతో తాము ఎప్పుడూ శాంతి కోసమేప్రయత్నాలు చేస్తున్నామని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు. భారత్ కూడా అదే కోరుకుంటే బావుంటుందని షరీఫ్ అన్నారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్‌తో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విషయంలో తప్ప ఏ విషయంలోనూ చర్చలు ఉండబోవని భారత్ తేల్చి చెప్పింది. .. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే పూర్తిగా ద్వైపాక్షికంగా ఉంటాయని.. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఉంటుందని ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ కూడా సోమవారం ( మే 26) గుజరాత్‌లో పర్యటిస్తూ.. పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ పౌరులు.. ప్రభుత్వ పెద్దలు శాంతిని కోరుకోకపోతే.. ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగల్పితే.. ఇండియన్ ఆర్మీ తమ సత్తా ఏంటో చూపుతుందని చెప్పుకొచ్చారు. ప్రశాంతంగా జీవిస్తూ రోటీలు తినండి.. లేకపోతే బుల్లెట్ దిగుతుందని హెచ్చరించారు.
అరకొరగా ఉన్న భారత్ .. పాకిస్తాన్ మధ్య సంబంధాలు పహల్గాం అటాక్ తరువాత పూర్తిగా దెబ్బతిన్నాయి. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రమూకల శిబిరాలను ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ చిత్తు చిత్తు చేసింది. తరువాత పాక్ రెచ్చిపోయి చేసిన దాడులను భారత్ ఎక్కడికక్కడ తిప్పికొట్టింది. పాక్ఆర్మీ.. ఎయిర్ బేస్ లను నాశనం చేసిన భారత ఆర్మీ.. దాయాది దేశానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన పాక్ ప్రభుత్వ పెద్దలు కాళ్లబేరానికి వచ్చి.. భారత్ తో శాంతి చర్చలు జరిపేందుకు సిద్దంగాఉన్నమని ప్రకటించారు. మరి ఈ విషయంలో ఎంత వరకు పాక్ తన మాటకు కట్టుబడి ఉంటుందో చూడాలి. . .