పాక్ కుక్కలా తోకముడుచుకొని యుద్ధం నుంచి పారిపోయింది..అమెరికా మాజీ ఆర్మీ ఆఫీసర్ 

పాక్ కుక్కలా తోకముడుచుకొని యుద్ధం నుంచి పారిపోయింది..అమెరికా మాజీ ఆర్మీ ఆఫీసర్ 
  •  ఇండియా దౌత్యపరంగా, సైనికపరంగా గెలిచిందని వ్యాఖ్య

వాషింగ్టన్: భారత్​తో జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయిందని, కుక్కలా తోకముడుచుకొని పారిపోయిందని అమెరికా మాజీ ఆర్మీ ఆఫీసర్ మైకెల్ రూబిన్ అన్నారు. టెర్రరిస్టుల క్యాంపులను ఇండియా ధ్వంసం చేసిందని యూఎస్​ఆర్మీ హెడ్​క్వార్టర్స్ పెంటగాన్ లో ఉన్నతాధికారిగా పనిచేసిన రూబిన్ పేర్కొన్నారు. తమ ఎయిర్​బేస్​లపై భారత్ దాడి చేయడంతో వణికిపోయిన పాక్.. సీజ్​ఫైర్​కోసం కోరిందని చెప్పారు.

ఈ ఘర్షణలో భారత్​దౌత్యపరంగా, సైనికపరంగా గెలిచిందన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్లు ప్రపంచం దృష్టికి వచ్చిందన్నారు. మే 7న భారత్ నిర్వహించిన దాడుల్లో పాక్​లోని టెర్రరిస్టు క్యాపుంలు ధ్వంసమయ్యాయని చెప్పారు. తర్వాత పాకిస్థాన్ చేసిన దాడులను భారత్ పూర్తిగా అడ్డుకుందని తెలిపారు. పాక్​ ఎయిర్​బేస్​లను నిర్వీర్యం చేసిందన్నారు.