1992లాగే 2019 జర్నీ… పాకిస్థాన్ వరల్డ్ కప్ గెలుస్తదట..!?

1992లాగే 2019 జర్నీ… పాకిస్థాన్ వరల్డ్ కప్ గెలుస్తదట..!?

1992లో పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచకప్ ను గెల్చుకుంది. ప్రస్తుతం 2019లోనూ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈసారి వరల్డ్ కప్ రేసులో, ఊసులో కూడా లేదు పాకిస్థాన్. ఐనా కూడా… సోషల్ మీడియాలో, క్రికెట్ విశ్లేషకులను కూడా ఆలోచనలో పడేశాయి కొన్ని ఈక్వేషన్స్. అందులో ముఖ్యమైనది పాకిస్థాన్ వరల్డ్ కప్ జర్నీ.

ఏడు మ్యాచ్ లు ముగిసేసరికి..  1992 లో పాకిస్థాన్ జర్నీ ఎలా సాగిందో.. 2019 లోనూ అదేవిధంగా కొనసాగింది.

ఫస్ట్ మ్యాచ్ లో పాక్ ఓడింది. రెండో మ్యాచ్ లో గెలిచింది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నాలుగో మ్యాచ్ ఓడింది. ఐదో మ్యాచ్ ఓడింది. ఆరో మ్యాచ్ తో విన్నింగ్ ట్రాక్ ఎక్కిన పాకిస్థాన్.. ఏడో మ్యాచ్ లోనూ విజయం సాధించింది.

ఇదేకాదు.. మరికొన్ని పోలికలు.. పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్ లపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఏడో మ్యాచ్ లోనూ 1992 లాగే 2019లోనూ న్యూజీలాండ్ పైనే విక్టరీ కొట్టింది పాకిస్థాన్.

అప్పుడూ ఇప్పడూ కూడా గ్రూప్ వైజ్ కాకుండా.. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్ లు జరుగుతున్నాయి.

1983లో భారత్ , 1987లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లు గెలిచాక… 1992లో పాక్ గెలిచింది.

ఈసారి కూడా 2011లో ఇండియా, 2015లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచాయి. ఆ లెక్కలోనూ ఈసారి కప్పు కొట్టేది పాకిస్థానే అంటున్నారు ఆ దేశ అభిమానులు.

1992లోనూ పాకిస్థాన్ అండర్ డాగ్. అప్పుడు పుంజుకుని ఆడి ప్రపంచకప్ నెగ్గి సంచలనం సృష్టించింది. ఈసారి కూడా అలాగే జరుగుతుందంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెడింగ్ టాపిక్.