భారత్‌పై యుద్దానికి .. పాక్​ మరో మిసైల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌

భారత్‌పై యుద్దానికి .. పాక్​ మరో మిసైల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌

ఇస్లామాబాద్: నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌‌‌‌లను ఛేదించగలిగే మిసైల్‌‌‌‌ ఫతాను పాకిస్తాన్‌‌‌‌ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మిసైల్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఛేదిస్తుందని పాక్‌‌‌‌ ఆర్మీ పేర్కొంది. మిసైల్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ పనితీరును, నావిగేషన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌, మెరుగైన ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకే టెస్ట్‌‌‌‌ నిర్వహించామని తెలిపింది. భారత్‌‌‌‌తో తలెత్తిన ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్‌‌‌‌ ఇలా మిసైల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చేయడం వారంలో ఇది రెండోది. 

అంతకుముందు 450 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌‌‌‌లను ఛేదించగలిగే అబ్దాలీ వెపన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ అనే బాలిస్టిక్‌‌‌‌ మిసైల్‌‌‌‌ను శనివారం పరీక్షించింది. భూమి మీది నుంచి భూమి మీదికి దాడి చేయగలిగే ఈ మిసైల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయిందని పాక్‌‌‌‌ ప్రకటించింది.