
మత చాందసవాదాన్ని తలకెక్కించుకున్న పాక్ దానిని ఉగ్రవాదులను పెంచి పోషించుకోవటానికి వాడుతున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో మతఘర్షణలు రేపేందుకు మెున్న గురుద్వారాలు, మందిరాలపై దాడి చేసింది. దానికి ముందు ముస్లీం కాని టూరిస్టులను పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపారు. ఇంత జరిగినా చీ పాకిస్థాన్ ఇంకా తన వక్ర బుద్ధిని అస్సలు మార్చుకోలేదని తాజా పరిస్థితులు మరోసారి రుజువు చేస్తున్నాయి. అసలు చనిపోయిన ఉగ్రవాది కుటుంబానికి నష్టపరిహారం ఏంట్రా బాబు అంటూ ప్రపంచ వ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. అయినా పాకిస్థానుకు మాత్రం చిల్లిగవ్వంతైనా సిగ్గులేదు.
గతవారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పూర్తిగా ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఈ క్రమంలో దాదాపు 100 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం భారత దాడిలో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించినందుకు గాను అతనికి రూ.14 కోట్లు పరిహారంగా చెల్లించనున్నట్లు ది ట్రిబ్యూన్ ఇండియా నివేదించింది. ఎందుకంటే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మృతులకు రూ.కోటి పరిహారం ఇచ్చేందుకు ఆమోదించటమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరణించివారి చట్టబద్ధమైన వారసులకు ఆ సొమ్ము అందించనున్నందున అతనికి భారీ చెల్లింపు జరగనుంది.
గతవారం ఇండియా జరిపిన మిసైల్ దాడుల్లో తన కుటుంబంలో 14 మంది మరణించారని ఏకంగా ఉగ్రవాదే ధృవీకరించగా.. ఇండియాపై ఖచ్చితంగా తాను పగతీర్చుకుంటానని, సర్వనాశనం చేస్తానంటూ ఒక లేఖను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారి కుటుంబంలో కేవలం మసూద్ అజార్ మాత్రమే బతికి ఉన్నందున చనిపోయిన అతని అక్క-భావ, మేనల్లుడు అతని భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలతో పాటు సహాయలకు రావాల్సిన డబ్బు ఉగ్రవాదికి పాక్ అందించనుందని తెలుస్తోంది.
అయితే పాక్ కేవలం మసూద్ అజార్ కి మాత్రమే ఇలా చెల్లిస్తోందా లేక మదరసాలను నడుపుతున్న ఇతర కీలక ఉగ్రవాదులకు సైతం పక్కదారిలో ఏదైనా చెల్లింపులు చేస్తోందా అనే విషయం తేలాల్సి ఉంది. మసీదుల మాటున ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న అనేక తీవ్రవాద సంస్థలకు నిలయంగా, ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన పాక్ ఇలా సాయం చేయటాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం మసూద్ అజార్ పాక్ ప్రభుత్వం నుంచి వస్తున్న నష్టపరిహారం డబ్బును తిరిగి తన ఉగ్రవాద కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ఉపయోగించే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.