పాకిస్తాన్ ట్రైనింగ్: భారత్ లోకి పదివేల మంది ఉగ్రవాదులు..!

పాకిస్తాన్ ట్రైనింగ్: భారత్ లోకి పదివేల మంది ఉగ్రవాదులు..!

భారత్ లో దాడులు చేసేందుకు పదివేల మంది  ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంది పాకిస్తాన్. ఇందుకుగాను POKలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసింది. నియంత్రణ రేఖ దగ్గర ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం అరెస్ట్ చేసి విచారణ జరపగా…. PoKలోని రావల్ కోట్ సిటీకి దగ్గర్లో టెర్రర్ ట్రెయినింగ్ క్యాంప్స్ పెట్టిందని తెలిపారు. ఇది జమాత్ ఎ ఇస్లామీ ఉగ్రవాద సంస్థ నేతృత్వంలో క్యాంప్ లు సెట్ చేశారని చెప్పారు. దీంతో పాటు..  జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తయిబా లాంటి సంస్థలకు చెందిన దాదాపు 10వేల మంది ఉగ్రవాదులకు ఈ క్యాంప్ లలో ట్రెయినింగ్ ఇస్తున్నారని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI ఆధ్వర్యంలో ట్రెయినింగ్ జరుగుతోందని తెలిసింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ షంషేర్ ఖాన్ ఈ క్యాంప్ లకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈనెల చివర్లో లేదంటే… అక్టోబర్ మొదట్లో భారత్ లోకి చొరబడేలా క్యాంపులు జరుగనున్నాట్లు సమాచారం.

LoC దగ్గరకు బలగాలను తరలిస్తోంది పాకిస్తాన్. దాదాపు 2వేల మందికిపైగా సైనికులను పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బాఘ్, కోట్లి సెక్టార్లలో నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంచిందని భారత సైన్యం తెలిపింది. పాక్ ఆర్మీ కదలికలను క్షుణ్ణంగా గమనిస్తున్నామని భారత సైనిక వర్గాలు తెలిపాయి. PoKలో ఉగ్రవాదులకు ట్రెయినింగ్ ఇస్తున్న టైమ్ లోనే పాక్ సైన్యం బలగాలను తరలించడాన్ని విశ్లేషిస్తోంది ఇండియన్ ఆర్మీ.

జమ్మూకశ్మీర్ లో మీడియాపై ఆంక్షలకు సంబంధించి ఈనెల 16న విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. ఆంక్షలపై ఆర్డర్ పాస్ చేయడానికి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ నిరాకరించింది. అనేక ప్రాంతాల్లోకి జర్నలిస్ట్ లను అనుమతించడంలేదని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల వాదనను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. కశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని… 80శాతానికి పైగా ల్యాండ్ లైన్లు పనిచేస్తున్నాయన్నారు అటార్నీ జనరల్ K K వేణుగోపాల్.

మాజీ సీఎం, PDP అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజాకు శ్రీనగర్ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. చెన్నైలో ఉన్న ఇల్లిజా గృహ నిర్భంధంలో ఉన్న తన తల్లి మెహబూబాను కలిసేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేయగా… సుప్రీం అనుమతించింది. అలాగే… అనారోగ్యంతో ఉన్న కశ్మీర్ కు చెందిన CPM నేత యూసుఫ్ తరిగామిని ఢిల్లీలోని ఎయిమ్స్ కు షిఫ్ట్ చేయాలని సుప్రీం ఆదేశాలిచ్చింది.

ఇక ఆర్టికల్ 370 రద్దు చేసి ఇవాళ్టికి నెల పూర్తైంది. దీంతో జమ్మూకశ్మీర్, లడఖ్ ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ తయారు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 10 కేంద్ర మంత్రిత్వ శాఖలు కలసి రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని నిర్ణయించాయి. అక్టోబర్ 31 నుంచి జమ్మూకశ్మీర్, లడఖ్ లు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక్కో BSF, CRPF బెటాలియన్లు ఇచ్చేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.