
పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. పూంచ్ జిల్లాలోని షాపూర్, కిర్ని సెక్టార్లలో మంగళవారం ఉదయం కాల్పులు జరపడంతో ఆరుగురు పౌరులు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాక్ బలగాలను భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది.