సిల్హెట్: పాకిస్తాన్‌తో శనివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. లిటన్ దాస్ (126) సెంచరీ చేసినా.. మిగతా వారు నిరాశపర్చడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో 278 రన్స్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను పాక్ బౌలర్లు ఖుర్రమ్ షహజాద్ (4/81), మహ్మద్ అబ్బాస్ (3/45), హసన్ అలీ (2/49) ఆరంభం నుంచే కట్టడి చేశారు. దాంతో మహ్మదుల్ హసన్ జాయ్ (0) డకౌట్ కాగా, తన్జిద్ హసన్ (26), మోమినల్ హక్ (22), నజ్ముల్ హుస్సేన్ (29), ముష్ఫికర్ రహీమ్ (23) మోస్తరుగా ఆడారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లలో 21/0 స్కోరు చేసింది. అజాన్ అవైస్ (13 బ్యాటింగ్), అబ్దుల్లా ఫజల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
