ఇస్లాం దేశాల్లో మహిళలు బుర్ఖా లేకుండా బహిరంగంగా తిరగరాదన్నది నిబంధన. దీనిని మీరితే ఆదేశాల్లో వేసే శిక్షలు దారుణంగా ఉంటాయి. పోనీ డిజైనింగ్ బుర్ఖాలు ధరించాలనుకునే మహిళలకు మత సంప్రదాయాలు అడ్డొస్తుంటాయి. ఈ సంసృతి.. పితృస్వామ్య వ్యవస్థపై ఓ మహిళ చేసిన పోస్ట్ పాక్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భర్తకి బుర్ఖా వేయించి డిన్నర్ డేట్ కి వెళ్లింది. ‘నా భర్త చాలా అందగాడు. కానీ, ఈ బుర్ఖా లో ఆయన అందాన్ని మీరు చూడలేకపోయి ఉండొచ్చు’ అంటూ పెద్ద సెటైరిక్ సందేశాన్ని ఆమె పోస్ట్ చేసింది. ఇన్‌స్టా గ్రామ్ లో ఆ దంపతులు చేసిన పోస్ట్‌కి చాలా మంది సానుకూలంగా స్పందించారు. ఆమెకి స పోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె తీరును సీరియస్‌గా తప్పుబడుతుండగా.. ఆమె ఆ కామెంట్లకు హిల్లేరియస్ గా కౌంటర్లు ఇస్తోంది.