PAK vs SA: ప్రపంచ ఛాంపియన్స్‌కు పాకిస్థాన్ షాక్.. టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అదిరిపోయే బోణీ

PAK vs SA: ప్రపంచ ఛాంపియన్స్‌కు పాకిస్థాన్ షాక్.. టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అదిరిపోయే బోణీ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచి 27 ఏళ్ళ తర్వాత ఐసీసీ టైటిల్ అందుకున్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆతిధ్య పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో బుధవారం (అక్టోబర్ 15) ముగిసిన ఈ మ్యాచ్ లో 93 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచి టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అదిరిపోయే బోణీ కొట్టింది. 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు సౌతాఫ్రికా 183 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్ నోమన్ అలీ, ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది తలో నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్ల్య్ పడగొట్టిన నోమన్ ఆలీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాకిస్థాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ రావల్పిండి వేదికగా అక్టోబర్ 20 నుంచి జరుగుతుంది. 2 వికెట్ల నష్టానికి 51 పరుగులతో నాలుగో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జోర్జి(16) ని షహీన్ అఫ్రిది పెవిలియన్ కు పంపిస్తే.. స్టబ్స్ (2)ను నోమన్ అలీ ఔట్ చేశాడు. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఓపెనర్ రికెల్ టన్ (45), బ్రెవీస్ (54) ఆదుకునే ప్రయత్నం చేశారు. 

వీరిద్దరి జోడీ ఐదో వికెట్ కు 73 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికాకు ఆశలు చిగురించాయి. అయితే బ్రెవీస్ ను నోమన్ బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా ఒక్కసారిగా కుప్పకూలింది. నోమన్ అలీతో పాటు షహీన్ అఫ్రిది కూడా చెలరేగడంతో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. తన పేస్ తో బెంబేలెత్తించిన అఫ్రిది చివరి రెండు వికెట్లను తీసి సఫారీ కథ ముగించాడు. అంతకుముందు 216/6 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 84 ఓవర్లలో 269 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. టోనీ డి జార్జీ (104) సెంచరీతో చెలరేగగా, లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ఫెయిలైంది. నోమన్‌‌‌‌ అలీ 6, సాజిద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ 3 వికెట్లు తీశారు. 

109 రన్స్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌‌‌‌ మొదలుపెట్టిన పాకిస్తాన్‌‌‌‌ 46.1 ఓవర్లలో 167 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (42) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. అబ్దుల్లా షఫీక్‌‌‌‌ (41), సౌద్‌‌‌‌ షకీల్‌‌‌‌ (38) మినహా మిగతా వారు నిరాశపర్చారు. సేనురన్ ముత్తుసామి 5, సిమోన్‌‌‌‌ హార్మర్‌‌‌‌ 4 వికెట్లు పడగొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 378 పరుగుల భారీ స్కోర్ చేసింది.