
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఓ ఊపు ఊపాయనే చెప్పాలి. ఇక నాటు నాటు పాటకు ఫిదా కానీ వారంటూ లేరు. తాజాగా ఈ పాటకు పాకిస్తాన్ కు చెందిన ఓ నటి స్టెప్పులేసి అదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పెళ్లి ఫంక్షన్‌లో పాకిస్తాన్ నటి హనియా ఆమిర్ నటుడు సబూర్ అలీతో కలిసి నాటు నాటు హిందీ వెర్షన్ నాచో నాచో సాంగ్‌కు ఓ రేంజ్‌లో స్టెప్పులేసింది. కాగా నాటు నాటు పాట ఆస్కార్స్ 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమాకు హాలీవుడ్ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి.