బ్యాట్ అంత లేడు కానీ.. భారీ షాట్లు..ధోని గుర్తుకొస్తున్నాడు

బ్యాట్ అంత లేడు కానీ.. భారీ షాట్లు..ధోని గుర్తుకొస్తున్నాడు

పిట్ట కొంచెం..కూత ఘనం అన్న సామెత ఈ పిల్లాడికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే బ్యాట్ అంత లేని ఈ పిల్లాడు..బ్యాట్ తో కళాత్మక షాట్లు కొడుతూ ఔరా అనిపిస్తున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో అదుర్స్ అనిపిస్తున్నాడు. ఒక్కో షాట్ కొడుతుంటే వావ్ అనక తప్పని పరిస్థితి. ప్రస్తుతం ఈ పిల్లాడి క్రికెట్ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. 

ఎవరీ పిల్లాడు..

వదులైన టీషర్టు.. టోపీ ధరించి  ఖతర్నాక్ షాట్లతో కళాత్మకంగా బ్యాటింగ్ చేస్తున్న ఈ బుడతడు పాకిస్తాన్కు చెందినవాడు. అయితే రజా మహర్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్కు ఈ పిల్లాడు మేనల్లుడు. తన మేనల్లుడు బ్యాటింగ్ చేస్తున్న వీడియోను రజా మహర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. బంతి ఎక్కడ పడ్డా కూడా వదలడం లేదు. స్క్వేర్ కట్ లు, హుక్ షాట్లు, హెలిక్యాప్టర్ షాట్లతో  దుమ్ము రేపాడు. ఒక్క బంతి కూడా వికెట్ల వెనకాలకు వెళ్లలేదంటే అతని ఏకాగ్రత ఎంత దృఢంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ప్రస్తుతం ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఒక షాట్లో ధోని..మరో షాట్లో సూర్య..

ఈ పిల్లాడి బ్యాటింగ్ ను చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాంబు చిన్నగా ఉన్నా..సౌండ్ మాత్రం సాలిడ్ అంటూ ఓ నెటిజన్ మెచ్చుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో రియాన్ పరాగ్ను ఈ బుడతడు భర్తీ చేయవచ్చని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇంకో యూజర్ అయితే ఏకంగా జూనియర్ సూర్యకుమార్ యాదవ్ అంటూ అకాశానికెత్తేశాడు. అతని హెలిక్యాప్టర్ షాట్కు ముగ్దుడైన ఓ యూజర్..ధోని వారసుడు అంటూ ప్రశంసించాడు. ఇంకొందరైతే టైమింగ్ ఈజ్ అన్ రిలీబుల్ , గ్రేట్ బ్యాటింగ్ పవర్ అంటూ కొనియాడారు. 

భారీ వ్యూస్..లక్షల్లో లైక్స్..

క్రికెట్ అభిమానులు, ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఈ వీడియో..ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది హృదయాలను దోచుకుంది. ఇప్పటి వరకు 29K కంటే ఎక్కువ మంది వీక్షించారు. 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raza Mahar (@razamahar12)