రెండో పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ స్టార్ హీరోయిన్

రెండో పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ స్టార్ హీరోయిన్

పాకిస్తానీ స్టార్ హీరోయిన్‌ మహీరా ఖాన్‌(Maihira khan) రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సలీమ్‌ కరీమ్‌(Salim karim)తో ఆమె వివాహం ఘనంగా జరిగింది. మహీరా పెళ్లి వీడియోను ఆమె మేనేజర్‌ అనుషయ్‌ తల్హా(Anupam talha) ఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అయితే ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. తనవైపు నడుచుకుంటూ వస్తున్న మహీరాను చుసిన వరుడు సలీమ్‌ కరీమ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఆమెను దగ్గరకు తీసుకుని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నాడు. పాకిస్తాన్‌లోని ముర్రేలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కొత్త జంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read :- OTTలో ఎంటర్టైన్మెంట్ జాతర

ఇక మహీరా ఖాన్ విసయానికి వస్తే.. పాకిస్తాన్ కు చెందిన ఈ నటి ఇండియాలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ హీరోగా వచ్చిన రేయిస్‌ మూవీలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ.