
పెషావర్: పాకిస్తాన్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో తెహ్రీక్–ఇ–తాలిబాన్(టీటీపీ)కు చెందిన 35 మంది టెర్రరిస్టులు చనిపోయారు. మరో12 మంది సైనికులు హతమయ్యారు. వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ ఆపరేషన్స్ జరిగాయి. ఈమేరకు శనివారం పాక్ మిలిటరీ ప్రకటన విడుదల చేసింది. మొదటగా బజౌర్ జిల్లాలో భద్రతా బలగాల ఆపరేషన్‌లో టీటీపీకి చెందిన 22 మంది టెర్రరిస్టులు మరణించారని పేర్కొంది. దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్ లో13 మంది టీటీపీ టెర్రరిస్టులను మట్టుబెట్టామని, ఎదురు కాల్పుల్లో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని వివరించింది.