పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దుబాయ్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచారు. దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించిన ముషారఫ్‌.. దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తరువాత పాక్ సైన్యంలో చేరారు. 1990లో పాక్ అర్మీ జనరల్ అయ్యారు. అలా  అంచెలంచెలుగా ఎదుగుతూ పాక్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్లారు. ముషారఫ్ 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. కార్గిల్‌ యుద్ధానికి ముషారఫ్‌ ప్రధాన కారకుడు. 2016 నుంచి ముషారఫ్ దుబాయిలోనే ఉంటున్నాడు.  ముషారఫ్ మృతదేహాన్ని తిరిగి పాకిస్తాన్‌కు తీసుకువస్తారో లేదో చూడాలి.