తాలిబాన్లకు అందరూ మద్దతుగా నిలవాలె

తాలిబాన్లకు అందరూ మద్దతుగా నిలవాలె

ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్‌లో కొత్తగా కొలువుదీరిన తాలిబాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తాలిబాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. అఫ్గానిస్థాన్‌లో సుస్థిరత, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు తాలిబాన్‌లతో కలసి పనిచేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలన్నారు. ‘అఫ్గానిస్థాన్ మొత్తం తాలిబాన్ల నియంత్రణలో ఉంది. అన్ని వర్గాలను కలుపుకుపోతూ తాలిబాన్లు బాగా పని చేయగలిగితే 40 ఏళ్ల కింద ఉన్నటువంటి శాంతియుత పరిస్థితులు తిరిగి ఆ దేశంలో ఏర్పడగలవు. కానీ అలా జరగకపోతే మాత్రం ఆందోళన చెందాల్సిందే. ముఖ్యంగా అక్కడ అతిపెద్ద మానవ సంక్షోభం, శరణార్థుల సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తాలిబాన్లకు అంతర్జాతీయ సమాజం బాసటగా నిలవాలని, అప్పుడే సంక్షోభ నివారణ సాధ్యమవుతుందన్నారు.