పాకిస్తాన్లో ఎయిర్ బేస్పై టెర్రరిస్ట్ దాడి.. ముగ్గురు హతం

పాకిస్తాన్లో ఎయిర్ బేస్పై టెర్రరిస్ట్ దాడి.. ముగ్గురు హతం

పంజాబ్ లోని మియాన్ వాలీ ఎయిర్ బేస్ పై శనివారం (నవంబర్4) ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. ప్రతీకార దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్ (ఫీఏఎఫ్) వెల్లడిం చింది. భారీ ఆయుధాలతో కూడి ఆరుగురు తీవ్రవాదులు తెల్లవారు జామున కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు వైమానిక స్థావరంలోకి ప్రవేశించేలోపే దాడిని ఎదుర్కొన్నామని పీఎఎఫ్ తెలిపింది. ఈ దాడిలో వైమానిక దళ స్థావంలో నిలిపి ఉంచిన మూడు విమానాలు దెబ్బతిన్నాయిన. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయని సైన్యం తెలిపింది.