రండి.. మాట్లాడుకుందాం!: ఇండియాతో చర్చలకు రెడీ

రండి.. మాట్లాడుకుందాం!: ఇండియాతో చర్చలకు రెడీ

ఇండియాతో చర్చలకు రెడీ అని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​

ఇస్లామాబాద్:  జమ్మూకాశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్​ 370ను పునరుద్ధరిస్తే ఇండియాతో చర్చలకు రెడీ అని పాకిస్తాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ అన్నారు. ‘కాశ్మీర్​ డే’ సందర్భంగా పాక్​లోని కోత్లీ జిల్లాలో శనివారం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ ‘‘కాశ్మీర్​ సమస్యను చర్చలతో పరిష్కరించుకోవడానికి రెడీ అని మేం ఇండియా ప్రధాని మోడీకి తెలియజేశాం. ఇది జరగాలంటే మీరు ఆర్టికల్​ 370ని పునరుద్ధరించాలి. యునైటెడ్​ నేషన్స్​ తీర్మానం ప్రకారం కాశ్మీరీలకు హక్కులను ఇవ్వాలి. దోస్తీ కోసం మేం చేస్తున్న ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం మా బలహీనతగా పొరపడకూడదు”అని అన్నారు. కాశ్మీరీలకు సపోర్ట్​ ఇవ్వడానికి ఏటా ఫిబ్రవరి ఐదున పాకిస్తాన్​ ‘కాశ్మీర్​ డే’ను పాటిస్తోంది. పాక్​తో చర్చలకు ఇండియాకు ఏమాత్రం ఆసక్తి లేదని పుల్వామా ఘటన తరువాత తనకు అర్థమైందని అన్నారు.