
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చావు దెబ్బ తిన్నది. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ బహవల్పూర్లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం సుభాన్ అల్లా క్లాంపెక్స్ భవనంపై భారత సైన్యం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో సుభాన్ అల్లా కాంప్లెక్స్ నామారూపాల్లేకుండా పోవడమే కాకుండా.. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీలో దాదాపు 10 మంది హతమయ్యారు.
అయితే.. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా జైష్-ఎ-మొహమ్మద్ బుద్ధి మారలేదు. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు నాలుగైదు నెలలపాటు కార్యకలాపాలు నిలిపేసిన జైష్-ఎ-మొహమ్మద్ మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అయితే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ సారి మరో కొత్త కుట్రకు తెరలేపుతున్నట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. గ్రూప్ నెట్ వర్క్ విస్తరణలో భాగంగా.. జేషే తొలిసారి ప్రత్యేకంగా మహిళలతో కూడిన ఉగ్రవాద దళం కోసం జమాత్ ఉల్-ముమినాత్ పేరుతో మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ ఫైండ్ఔట్ చేసింది.
ఈ మహిళా బ్రిగేడ్ కోసం వ్యక్తులను నియమించుకోవడానికి, నిధులను సేకరించడానికి 'తుఫత్ అల్-ముమినాత్' అనే ఆన్‌లైన్ శిక్షణా కోర్సును కూడా ప్రారంభించనున్నట్లు తెలిసింది. 2025, నవంబర్ 8 నుంచి ఆన్ లైన్ కోర్సు ప్రారంభం కానుందని.. ఇందులో భాగంగా ప్రతిరోజు 40 నిమిషాల పాటు మహిళా బ్రిగేడ్లకు పాఠాలు బోధించనున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
►ALSO READ | ఇజ్రాయెల్ లో జేడీ వాన్స్ పర్యటన
మసూద్ అజార్‌తో పాటు ఆయన సోదరీమణులు సాదియా అజార్, సమైరా అజార్, జేషే టాప్ కమాండర్స్ మహిళా బ్రిగేడ్లకు క్లాసులు చెప్పనున్నారు. తుఫత్ అల్-ముమినాత్ ఆన్ లైన్ కోర్సులో చేరే ప్రతి మహిళ సంస్థకు రూ.500 (పాకిస్తానీ రూపాయలు) విరాళం ఇవ్వడంతో పాటు ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపమని జేషే డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మహిళా ఉగ్రవాద దళంలోకి తీవ్రవాదుల భార్యలు, పేద మహిళలే లక్ష్యంగా రిక్రూట్ చేసుకోవాలని జేషే ప్లాన్ చేస్తోన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
మహిళా బ్రిగేడ్ గ్రూప్ బాధ్యతలను మసూద్ అజర్ తన చెల్లెలు సాదియా, సమైరా చేతిలో పెట్టినట్లు సమాచారం. సాదియా భర్త యూసప్ అజార్, సమైరా భర్త ఉమర్ ఫరూక్ ఇద్దరూ కూడా ఉగ్రవాదులే. పుల్వామా ఉగ్రదాడి కుట్రదారుడే ఈ ఉమర్ ఫరూక్. వీరిద్దరూ భారత సైన్యం చేతిలోనే హతం కావడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్‌లో యూసప్, ఇండియన్ ఆర్మీ ఎన్ కౌంటర్లో ఉమర్ ఫరూక్ కుక్క చావు చచ్చారు. ఆత్మాహుతి దాడులు నిర్వహించడమే లక్ష్యంగా జైషే ఈ మహిళా బిగ్రేడ్ ను ఏర్పాటు చేస్తోన్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు ఈ మేరకు అప్రమత్తమయ్యాయి.