ఇమ్రాన్‌ వ్యాఖ్యలకు ఆర్మీ చీఫ్‌ కౌంటర్‌

ఇమ్రాన్‌ వ్యాఖ్యలకు ఆర్మీ చీఫ్‌ కౌంటర్‌

పుల్వామా ఉగ్రదాడి భారత్‌ ఇంటి పనేనని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్ రావత్ దీటుగా తిప్పికొట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్‌ పాత్రపై భారత్‌ పూర్తి ఆధారాలను పాక్‌కు ఇచ్చిందని చెప్పారు. భారత నిఘా సంస్ధలు పుల్వామాలో ఏం జరిగిందనేది ఆధారాలతో సహా అందించాయని..ఇంతకంటే తాను ఏమీ చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు.

కార్గిల్ లాంటి దాడికి పాకిస్తాన్ మరోసారి ప్రయత్నించబోదని అనుకుంటున్నట్టు చెప్పారు బిపిన్ రావత్. 1999లో పాకిస్తాన్ సైన్యం దుస్సాహసానికి పాల్పడిందని… అలాంటి తప్పు మరోసారి చేయబోదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించి రేపటితో 20 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఆ వేడుకల ఏర్పాట్లను ఆర్మీ చీఫ్ పర్యవేక్షించారు.

పుల్వామాలో CRPF కాన్వాయ్ పై ఉగ్రదాడి భారత్ కు చెందిన ఉగ్రవాదులే చేశారన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటనను కొట్టిపారేశారు బిపిన్ రావత్. తమకు నిజాలు తెలుసని… పాక్ ప్రధాని స్టేట్ మెంట్ తమకు అక్కర్లేదన్నారు.