స్మృతి మంధానతో పెళ్లి వాయిదా.. గంటల వ్యవధిలోనే ఆసుపత్రి పాలైన పలాష్ ముచ్చల్..!

స్మృతి మంధానతో పెళ్లి వాయిదా.. గంటల వ్యవధిలోనే ఆసుపత్రి పాలైన పలాష్ ముచ్చల్..!

ముంబై: విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన, మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ పలాష్‌‌‌‌‌‌‌‌ ముచ్చల్‌‌‌‌‌‌‌‌ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఆదివారం (నవంబర్ 23) పెళ్లి జరగాల్సి ఉండగా స్మృతి తండ్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ అనారోగ్యానికి గురి కావడంతో చివరి నిమిషంలో పెళ్లి పోస్ట్‎పోన్ అయ్యింది. ఇదిలా ఉండగా.. స్మృతి మంధానతో పెళ్లి వాయిదా పడిన గంటల వ్యవధిలోనే ఆమెకు కాబోయే భర్త, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

వైరల్ ఇన్ఫెక్షన్, తీవ్రమైన అసిడిటీ కారణంగా పలాష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పలాష్ బాగానే ఉన్నాడని.. అతని పరిస్థితి తీవ్రంగా లేదని తెలుస్తోంది. ట్రీట్మెంట్ అనంతరం పలాష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. ఒకవైపు తండ్రి అనారోగ్యానికి గురైన బాధలో ఉన్న స్మృతిని కాబోయే భర్త కూడా అస్వస్థతకు గురి కావడం మరింత బాధలోకి నెట్టేసింది. అయితే, ఇద్దరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఇరుకుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. 

ఆదివారం (నవంబర్ 23) పెళ్లి జరగాల్సి ఉండగా వేడుకల్లో పాల్గొన్న మంధాన తండ్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.‘ఉదయం టిఫిన్‌‌‌‌‌‌‌‌ చేసే సమయంలో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ అనారోగ్యానికి గురయ్యారు. ఎడమ వైపు చాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కార్డియాక్‌‌‌‌‌‌‌‌ ఎంజైమ్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా ఉన్నాయని ఈసీజీ, ఇతర నివేదికల్లో బయటపడింది. 

బీపీ కూడా ఎక్కువగా ఉంది. దానిని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంచాం. మా వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. పరిస్థితి మరింత తీవ్రమైతే యాంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి ఫ్యామిలీ మాతో టచ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నారు. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో అతని పరిస్థితి స్థిరంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అని మంధాన ఫ్యామిలీ డాక్టర్‌‌‌‌‌‌‌‌ నమన్‌‌‌‌‌‌‌‌ షా వెల్లడించాడు. తండ్రి అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెళ్లిని నిరవధికంగా వాయిదా వేసినట్లు స్మృతి మేనేజర్‌‌‌‌‌‌‌‌ తుహిన్‌‌‌‌‌‌‌‌ మిశ్రా చెప్పాడు.