పంచాయతీ ఎన్నికల్లో అత్తా వర్సెస్‌‌‌‌‌‌‌‌ కోడలు .. జీడి నగర్‌‌‌‌‌‌‌‌ లో ఒకే ఇంట్లో అభ్యర్థులు

పంచాయతీ ఎన్నికల్లో అత్తా వర్సెస్‌‌‌‌‌‌‌‌ కోడలు  ..  జీడి  నగర్‌‌‌‌‌‌‌‌ లో ఒకే ఇంట్లో అభ్యర్థులు

గోదావరిఖని, వెలుగు : రామగుండం నియోజకవర్గపరిధిలోని పాలకుర్తి మండలం ఘన్‌‌‌‌‌‌‌‌శ్యామ్‌‌‌‌‌‌‌‌దాస్‌‌‌‌‌‌‌‌ (జీడి)నగర్‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ పదవికి అత్తా, కోడలు పోటీ పడుతున్నారు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌‌‌‌‌‌‌‌ కావడంతో మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేయించారు. అయితే నర్సమ్మ పెద్ద కోడలు సూర రమాదేవి సైతం నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేసింది. జీడినగర్‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ బరిలో ముగ్గురు క్యాండిడేట్లు ఉండగా.. ఒకే ఇంటి నుంచి ఇద్దరు బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. 

చింతగూడెంలో తోటికోడళ్లు

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ పదవి కోసం తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. చింతగూడెం గ్రామం జనరల్‌‌‌‌‌‌‌‌ మహిళకు రిజర్వ్‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో తోటికోడళ్లైన గూడూరు శ్రీలత, గూడూరు భవానీ నామినేషన్లు వేశారు. శ్రీలత మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ కాగా.. భవానీ మొదటి సారి ఎన్నికల బరిలో నిలిచింది. ఇద్దరు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలోనే కొనసాగుతుండగా... బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాత్రం భవానీకి మద్దతు ఇస్తోంది.