జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను తెలుసుకొని వారి సంక్షేమం కోసం పనిచేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం బోరబండ డివిజన్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఎంపీ మల్లు రవితో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
గతంలో జూబ్లీహిల్స్‌లో డ్రైనేజీ, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవని, కాంగ్రెస్ ప్రభుత్వం గత 24 నెలల్లో సీసీ రోడ్లు, మౌలిక వసతులు మెరుగుపరిచిందని తెలిపారు. మల్లు రవి మాట్లాడుతూ.. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
