- అమ్మవార్ల అనుగ్రహంతో వేగంగా పనులు
- మహా జాతర నాటికి అధునాతన వసతులు
హైదరాబాద్/ములుగు: మేడారంలో శాశ్వతపనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 8 ద్వారాలు, ప్రాకారాలు, నాలుగు గద్దెలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. డబ్బులకు వెనకాడకుండా శాశ్వత నిర్మాణ పనులు చేస్తున్నామన్నారు. ఇవాళ మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి పర్యటించా రు. పనులు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జాతర ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు.
అంతకు ముందు గద్దెల వద్ద జరుగుతున్న పనులు పరిశీలించారు. ఏ అధికారి ఏ పని చేస్తున్నారో అర్థం కావడం లేదు.. పనులు సక్రమంగా చేయకుండా నిర్ల క్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న పాలరాతి శిల్పాలను పరిశీలించి సకాలంలో పూర్తవు వుతాయా..? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. 24 గంటల పాటు పనులు కొనసా గించి, సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రుల వెంట ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు.

